Amit Shah: అమిత్ షా పర్యటన విషయంలో గందరగోళం.. 

By Rajesh Karampoori  |  First Published Nov 17, 2023, 7:15 PM IST

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన విషయంలో అయోమయం నెలకొంది. అయితే, చివరి నిమిషంలో అమిత్ షా నేడు హైదరాబాద్ రావడంలేదని తెలియడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. 


Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన విషయంలో గందరగోళం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా శుక్రవారం( నేడు) రాత్రి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల రీత్యా ఆయన శనివారం మధ్యాహ్నం 12గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు. ఇలా చివరి నిమిషంలో షెడ్యూల్ లో మార్పు జరిగింది.

తాజా షెడ్యూల్ ప్రకారం.. రేపు(శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. అనంతరం 12.50 గంటల ప్రాంతంలో బేగంపేట్ నుంచి నేరుగా గద్వాల సభకు అమిత్ షా వెళ్లి ప్రసంగిస్తారు.తర్వాత నల్గొండ, వరంగల్ జిల్లాలో షా ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించనున్నారు. ఆ తరువాత సాయంత్రం 6.10 గంటలకు హైదరాబాద్ చేరుకుని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారు.

Latest Videos

undefined

అనంతరం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితితో పాటు ఇతర అనుబంధ విభాగాలతో సమావేశమయ్యారు అమిత్ షా. ఈ భేటీ ముగిశాక సాయంత్రం 7:55 కి బేగంపేట విమానాశ్రయం నుంచి అమిత్ షా అహ్మదాబాద్ బయలుదేరి వెళ్తారు. వాస్తవానికి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన మరుసటి రోజు బీజేపీ మేనిఫెస్టో కూడా విడుదలవుతుందని భావించారు.

ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయ్యింది. వాస్తవానికి అమిత్ షా రెండు రోజుల పర్యటన కోసం ఈనెల 16న తెలంగాణకు వస్తారని, 17వ తేదీ మేనిఫెస్టో విడుదల చేస్తారని పార్టీ శ్రేణులు భావించారు. ఇలా అమిత్ షా పర్యటన వరుసగా వాయిదా పడుతుండటంతో ఆయన ఇంతకీ  తెలంగాణకు వస్తున్నారా?  లేదా?  ఒక్కవేళ వస్తే ఎప్పుడు వస్తాడు? అనేది సమాచారం ఆ పార్టీ నేతలకే తెలియడం లేదు. 

click me!