Anchor Kathi Karthika : ఎన్నికలు సమీస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మరో నాయకురాలు పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ లో చేరింది. ఇంతకీ ఆ నాయకురాలు ఎవరు?
Kathi Karthika: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ తరుణంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన ముందు, నేషన్ల ప్రక్రియ సమయంలో నేతలు పార్టీలను ఫిరాయించడం. టికెట్ల కోసం, పదవుల కోసం మరో పార్టీలో జంప్ కావడం చూస్తుంటాం. కానీ, కానీ తెలంగాణలో మాత్రం నామినేషన్ల పర్వానికి తెరపడినా నేతల ఫిరాయింపులు మాత్రం కొనసాగుతునే ఉన్నాయి
తాజాగా ప్రముఖ రేడియో జాకీ, బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ కత్తి కార్తీక (Anchor Kathi Karthika) కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో కత్తి కార్తీక గులాబీ కండువా కప్పుకుంది. బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంది. అంతకుముందు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఆమె దుబ్బాక ఉప ఎన్నికలోనూ పోటీ చేశారు. కానీ ఓటమి పాలైంది.
ఆ తరువాత పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పార్టీలో కత్తి కార్తీక చాలా యాక్టివ్ గా పనిచేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలోనూ పాల్గొన్నారు. అయినప్పటికీ పార్టీ ఆమెకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించిన ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కత్తి కార్తీక తాజాగా గులాబీ దళంలో చేరారు. కత్తి కార్తీక ను గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు సూచించినట్టు తెలుస్తోంది.