నేడే అసెంబ్లీలో టీఎస్ఆర్టీసీ బిల్లు: కేసీఆర్ సర్కార్ ప్లాన్

By narsimha lode  |  First Published Aug 6, 2023, 2:39 PM IST

తెలంగాణ ఆర్టీసీ బిల్లును  ప్రభుత్వం ఇవాళే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. ఈ దిశగా  ప్రభుత్వం  చర్యలు తీసుకుంటుంది


హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం  ఆదివారంనాడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది.  తెలంగాణ ఆర్టీసీ బిల్లును  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.  తెలంగాణ ప్రభుత్వం  పంపిన  ఆర్టీసీ బిల్లుకు  రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  అనుమతిని ఇచ్చారు. ఈ బిల్లును  శాసనసభలో ప్రవేశ పెట్టేందుకు  అనుమతిని ఇచ్చారు. అంతేకాదు  10 అంశాలపై  గవర్నర్ సిఫారసు చేశారు.

గవర్నర్ పంపిన సిఫారసు లేఖతో  అధికారుల బృందం  నేరుగా అసెంబ్లీకి చేరుకుంది. అసెంబ్లీలో  సీఎం కేసీఆర్ తో అధికారులు  సమావేశమయ్యారు.  టీఎస్ఆర్‌టీసీ బిల్లును ప్రవేశ పెట్టనుంది  ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతిపై  చర్చపై  సీఎం కేసీఆర్  అసెంబ్లీలో ప్రసంగించనున్నారు.  కేసీఆర్  ప్రసంగం  తర్వాత  ఈ బిల్లును  సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. 

Latest Videos

also read:టీఎస్ఆర్టీసీ బిల్లు: ఆమోదం తెలిపిన తమిళిసై , సర్కార్‌కు పది సిఫారసులు

రాష్ట్రంలోని  ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఈ ఏడాది జూలై  31న  కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  ఈ బిల్లును  గవర్నర్ అనుమతి కోసం పంపారు. అయితే ఈ బిల్లుపై  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  పలు సందేహలను  వ్యక్తం  చేశారు.ఈ సందేహలపై  అధికారులు  సమాధానాలు ఇచ్చారు.

ఈ సమాధానాలపై  సంతృప్తిని వ్యక్తం  చేసిన గవర్నర్  టీఎస్ఆర్టీసీ ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు అనుమతిని ఇచ్చారు. అంతేకాదు  ప్రభుత్వానికి  10 అంశాలపై  సిఫారసులను చేశారు.  ఈ బిల్లుపై  అసెంబ్లీలో  చర్చించేందుకు వీలుగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను  మరో రెండు  రోజులను పొడిగిస్తూ  నిర్ణయం తీసుకున్నారు. 

click me!