కోలుకున్న అక్బరుద్దీన్..సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..?

sivanagaprasad kodati |  
Published : Dec 22, 2018, 05:31 PM IST
కోలుకున్న అక్బరుద్దీన్..సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..?

సారాంశం

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కోలుకున్నారు. గురువారం రాత్రి ఓ విందుకు హాజరైన అక్బరుద్దీన్‌కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను కంచన్‌బాగ్‌లోని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. 

ఆయనకు ఆస్పత్రి మొదటి అంతస్తులోని ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త విని ఎంఐఎం నేతలు, కార్యకర్తలు, బంధువులు హుటాహుటిన ఒవైసీ ఆసుపత్రికి చేరుకుని అక్బరుద్దీన్‌ను పరామర్శించి వెళ్లారు. ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకోవడంతో.. ఒవైసీని ఆసుపత్రి నుంచి ఈ సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఓవైసికి తీవ్ర అస్వస్థత...హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

PREV
click me!

Recommended Stories

Exam Tips : ఎగ్జామ్స్ కు ముందు టెన్షన్ తగ్గించుకునే... టాప్ 5 గోల్డెన్ టిప్స్
Rain Alert : నేడే బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ తెలుగు జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే