రూ.25 లక్షల ఆఫర్: కాంగ్రెస్‌పై అసదుద్దీన్ సంచలన ఆరోపణలు

Published : Nov 20, 2018, 10:50 AM ISTUpdated : Nov 20, 2018, 05:22 PM IST
రూ.25 లక్షల ఆఫర్: కాంగ్రెస్‌పై అసదుద్దీన్ సంచలన ఆరోపణలు

సారాంశం

ఎంఐఎం  చీఫ్ అసదుద్దీన్  ఓవైసీ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు

నిర్మల్: ఎంఐఎం  చీఫ్ అసదుద్దీన్  ఓవైసీ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ సభలో తాను పాల్గొనకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపణలు చేశారు.
 
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్‌లో  సోమవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల సభలో  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్  ఓవైసీ పాల్గొన్నారు. ఈ సభలో  తాను పాల్గొనకుండా ఉండేందుకుగాను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని అసదుద్దీన్ ఆరోపించారు. అంతేకాదు తనకు రూ. 25 లక్షలు కూడ డబ్బులు ఇస్తామని  చెప్పారని అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిర్మల్ సభలో  తాను పాల్గొనకుండా ఉంటే తనకు రూ. 25 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఫర్ చేశారని  అసుద్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తనతో  చేసిన సంభాషణకు సంబంధించిన రికార్డులు కూడ ఉన్నాయని  ఆయన చెప్పారు. తనను ఎవరూ కూడ కొనలేరని అసదుద్దీన్ చెప్పారు. మీరు మోసపోవద్దని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేయాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అసద్‌కు మహేశ్వర్ రెడ్డి కౌంటర్: నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా

మజ్లిస్‌కు కాంగ్రెస్ రూ.25 లక్షల ఆఫర్ (ఆడియో)

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ