హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు..

Published : Nov 20, 2018, 10:39 AM IST
హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు..

సారాంశం

 లుంబీనీ పార్క్ వద్ద ఓ కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్ లోకి దూసుకుపోయింది.  

హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ రోడ్డులోని లుంబీనీ పార్క్ వద్ద ఓ కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్ లోకి దూసుకుపోయింది.  యూటర్న్ తీసుకుంటుండగా.. కారు అదుపుతప్పి పుట్ ఫాత్ నుంచి దూసుకెళ్లి.. హుస్సేన్ సాగర్ లో పడిపోయింది.

గమనించిన స్థానికులు కారులోని వారిని రక్షించారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారును క్రేన్ సహాయంతో బయటకు తీసినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.

మితిమీరిన వేగంతో రావడం కారణంగానే కారు ప్రమాదానికి గురైందని సిబ్బంది తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సయంలో కారు నడిపిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడా అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు వారు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్