సెక్రటేరియేట్‌లో ప్రార్థనా మందిరాలు దెబ్బతినడంపై కేసీఆర్ ప్రకటన: అసదుద్దీన్ స్పందన

Siva Kodati |  
Published : Jul 10, 2020, 03:43 PM IST
సెక్రటేరియేట్‌లో ప్రార్థనా మందిరాలు దెబ్బతినడంపై కేసీఆర్ ప్రకటన: అసదుద్దీన్ స్పందన

సారాంశం

హైదరాబాద్‌లోని పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న  క్రమంలో శిథిలాలు పడి అక్కడికి సమీపంలోని ఆలయం, మసీదులు దెబ్బతిన్నాయి. దీనిపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. ప్రభుత్వ ఖర్చులతో మళ్లీ నిర్మిస్తామంటూ ప్రకటన చేశారు

హైదరాబాద్‌లోని పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న  క్రమంలో శిథిలాలు పడి అక్కడికి సమీపంలోని ఆలయం, మసీదులు దెబ్బతిన్నాయి. దీనిపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. ప్రభుత్వ ఖర్చులతో మళ్లీ నిర్మిస్తామంటూ ప్రకటన చేశారు.

దీనిపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు యునైటెడ్ ముస్లిం ఫోరం తరపున పూర్తి ప్రకటన చేస్తామని అసదుద్దీన్ తెలిపారు.

కాగా.. తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.

Also Read:సచివాలయం కూల్చివేత: ప్రార్ధనా మందిరాలు దెబ్బతినడంపై కేసీఆర్ ఆవేదన

ఇలా జరిగి ఉండాల్సింది కాదు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం తప్ప, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు.

ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా ఎన్నికోట్లైనా వెనుకాడకుండా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దేవాలయం, మసీదు నిర్వాహకులతో నేనే త్వరలోనే సమావేశమవుతానని ఆయన హామీ ఇచ్చారు.

మత పెద్దల అభిప్రాయాలు తీసుకొని  కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్పూర్తిని కొనసాగిస్తామన్నారు. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి అని ముఖ్యమంత్రి కోరారు.

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్