గర్భిణికి అందని చికిత్స, 2 రోజులు అంబులెన్స్‌లోనే: కడుపులోనే శిశువు మృతి

By narsimha lodeFirst Published Jul 10, 2020, 3:30 PM IST
Highlights

గద్వాల గర్భిణీ ఘటన మరువక ముందే అదే తరహా ఘటన ఒకటి హైద్రాబాద్ లో చోటు చేసుకొంది. గద్వాల ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా అదే తరహా ఘటన చోటు చేసుకొంది.


హైదరాబాద్:గద్వాల గర్భిణీ ఘటన మరువక ముందే అదే తరహా ఘటన ఒకటి హైద్రాబాద్ లో చోటు చేసుకొంది. గద్వాల ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా అదే తరహా ఘటన చోటు చేసుకొంది.

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలానికి చెందిన  25 ఏళ్ల విజయకు నెలలు నిండడంతో గత నెల 29వ  తేదీన సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు ఈ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన తర్వాత సరైన సౌకర్యాలు లేని కారణంగా  హైద్రాబాద్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

దీంతో ఈ నెల 3వ తేదీన కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యం చేసేందుకు ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించింది. దీంతో సోమాజీగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

also read:గద్వాల సీన్ రిపీట్: 13 గంటలు ఆసుపత్రుల చుట్టూ, అంబులెన్స్‌లోనే గర్భిణీ మృతి

అయితే ఇక్కడ కూడ వైద్యం చేసేందుకు ఆసుపత్రి నిర్వాహకులు నిరాకరించారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ లలోని ప్రైవేట్ ఆసుపత్రుల వద్దకు తీసుకెళ్లినా కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదిలేక బాధిత కుటుంబం పోలీసులకు ఫోన్ చేశారు.పోలీసులు వచ్చి ఆసుపత్రి యాజమాన్యానికి చికిత్స అందించాలని సూచించారు. 

రూ. 8 లక్షలు ఖర్చు అవుతోందని చెప్పడంతో స్వంత ఊరికి వెళ్లిపోయారు.రెండు రోజుల పాటు ఆమె అంబులెన్స్ లోనే ఉంది. కానీ, ఆసుపత్రిలో చేర్చుకొనేందుకు ఆయా ఆసుపత్రి యాజమాన్యాలు అంగీకరించలేదు.

ఈ నెల 5 వ తేదీన సుల్తాన్ బజార్ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో వైద్యులు ఆమెను పరీక్షించారు. వెంటనే ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి కడుపులో నుండి మృత శిశువును తీశారు.విజయ ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉండడంతో ఆమెను గురువారం నాడు డిశ్చార్జ్ చేశారు. 

click me!