అందరూ నిర్దోషులైతే మసీదును ఎవరు కూలగొట్టారు? అసదుద్దీన్ ఓవైసీ

By narsimha lodeFirst Published Sep 30, 2020, 2:30 PM IST
Highlights

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరూ నిర్ధోషులే అయితే ... అసలు కూల్చింది ఎవరని హైద్రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.


హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరూ నిర్ధోషులే అయితే ... అసలు కూల్చింది ఎవరని హైద్రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.

 బాబ్రీమసీదు కూల్చివేతపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. మసీదు దానికదే కూలిపోయిందా అని ఆయన ప్రశ్నించారు.  భారత  దేశ చరిత్రలో ఇది చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు.  మసీదు ఎవరు కూల్చారో యావత్ ప్రపంచం చూసిందని ఆయన గుర్తు చేశారు.

సరైన ఆధారాలు లేవని అందరిపై  అభియోగాలు కొట్టివేయడం సరైంది కాదని ఆయన చెప్పారు.సీబీఐ చార్ఝీషీట్ లో అనేక విషయాలను దాచిపెట్టారని ఆయన ఆరోపించారు.ఈ కేసులో సీబీఐ కోర్టు తీర్పు బాధాకరమన్నారు. ఈ కేసుపై సీబీఐ హైకోర్టులో సవాల్ చేయాలని ఆయన సూచించారు.

ఇవాళ తీర్పును వెల్లడించే సమయంలో అద్వానీ, మురళీ మనోహార్ జోషీల అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరు కాలేదు. కరోనా కారణంగా  మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి హాజరుకాలేదు.

బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అప్పటి ప్రభుత్వం లిబర్హాన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ కేసు ను సీబీఐ విచారించింది. 

click me!