మెడికో ప్రీతి ఘటనపై విచారణ: ఎంజీఎం సూపరింటెండ్ డాక్టర్ చంద్రశేఖర్

By narsimha lodeFirst Published Feb 22, 2023, 2:33 PM IST
Highlights

మెడికో  ప్రీతి  ఆత్మహత్యాయత్నం చేసుకుందా లేదా  అనే  విషయమై    అంతర్గతంగా  విచారణ చేస్తున్నామని ఎంజీఎం  సూపరింటెండ్  డాక్టర్  చంద్రశేఖర్ చెప్పారు.  

వరంగల్: మెడికో  ప్రీతి  ఘటనపై విచారణకు  కమిటీని  ఏర్పాటు  చేసినట్టుగా  ఎంజీఎం  ఆసుపత్రి సూపరింటెండ్  డాక్టర్  చంద్రశేఖర్ చెప్పారు. బుధవారం నాడు  వరంగల్ లో  ఆయన మీడియాతో మాట్లాడారు.  మెడికో  ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసుకుందా , ఇతరత్రా  కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం తేలాల్సి ఉందన్నారు.  ఈ విషయమై  విచారణ చేస్తున్నామన్నారు.  ప్రీతి హనికరమైన ఇంజక్షన్ తీసుకున్నట్టుగా  తమకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ప్రీతితో పాటు  విధులు నిర్వహించిన  మరో ఇద్దరిని కూడా ఈ విషయమై  విచారించినట్టుగా  డాక్టర్  చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు.

 ప్రీతి  ఏదైనా  ఇంజక్షన్ తీసుకుంటే  ఆ ఇంజక్షన్ కు విరుగుడు ఇవ్వడానికి  ఈ సమాచారం తెలుసుకున్నామని  ఆయన వివరించారు.   మూడు మాసాల క్రితం  ప్రీతి తమ కాలేజీలో  చేరిందన్నారు. మూడు మాసాల నుండి  వేధింపులు జరుగుతున్నాయా లేదా అనే విషయం విచారణలో తేలనుందన్నారు.  ఇంతకాలం నుండి  ప్రీతి వేధింపులను భరిస్తుందా , ఇటీవల కాలంలోనే  వేధింపులు ప్రారంభమయ్యాయా అనే విషయమై  విచారణ కమిటీ తేల్చనుందని  సూపరింటెండ్  తెలిపారు.

also read:వరంగల్ కేఎంసీలో మెడికో ఆత్మహత్యాయత్నం: వేధింపులే కారణమంటున్న తండ్రి

 ఈ విషయం తమ దృష్టికి రావడంతో   సీనియర్ విద్యార్ధిని  వేరే విభాగంలోకి  మార్చినట్టుగా  సూపరింటెండ్  తెలిపారు.  ప్రీతిపై  సీనియర్  ర్యాగింగ్ కు పాల్పడితే   చట్టప్రకారం  శిక్షిస్తామని  సూపరింటెండ్  తెలిపారు.  ఈ విషయమై  పోలీసులకు  కూడా  తాము ఫిర్యాదు  చేసినట్టుగా  సూపరింటెండ్  తెలిపారు. పోలీసుల విచారణకు  తాము పూర్తిగా సహకరిస్తామన్నారు.మరో వైపు పోలీసుల విచారణతో పాటు  అంతర్గతంగా  ఫ్రొఫెసర్ల కమిటీ   నివేదిక ఆధారంగా  చర్యలు తీసుకుంటామని  డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 

click me!