మధ్యలోనే ఆగిపోయిన మెట్రో రైలు.. ప్రయాణికుల ఆందోళన

By ramya neerukondaFirst Published Oct 13, 2018, 11:16 AM IST
Highlights

మియాపూర్ నుంచి అమీర్ పేటకు బయలుదేరిన మెట్రో రైలు.. బాలానగర్ లో సడెన్ గా ఆగిపోయింది. కరెంట్ సప్లై లేకపోవడంతో రైలు నిలిచిపోయిందని మెట్రో సిబ్బంది చెబుతున్నారు.

హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ రోజు ఉదయం మియాపూర్ నుంచి అమీర్ పేటకు బయలుదేరిన మెట్రో రైలు.. బాలానగర్ లో సడెన్ గా ఆగిపోయింది. కరెంట్ సప్లై లేకపోవడంతో రైలు నిలిచిపోయిందని మెట్రో సిబ్బంది చెబుతున్నారు.

బాలానగర్ లో మెట్రో ఆగి చాలా సమయం గుడుస్తున్నా.. తిరిగి రైలు కదలకపోయే సరికి ప్రయాణికులకు అనుమానం కలిగింది. దీనిపై మెట్రో సిబ్బందిని ప్రశ్నించగా.. సరైన సమాధానం వారి వద్ద నుంచి రాలేదు. దీంతో.. ప్రయాణికులు ఆందోళనకు దిగారు.  మొదట ఒక్క సర్వీసు కి మాత్రమే అంతరాయం తలెత్తగా.. ఆ తర్వాత ఇతర మెట్రో సర్వీసుల కూడా అంతరాయం ఏర్పడింది.

వేరే మెట్రో రైలు వస్తుంది అని చెబుతూ 45నిమిషాలుగా తమను వెయిట్ చేయించారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వమని కొందరు ప్రయాణికులు సిబ్బందిపై ఒత్తిడి తీసుకురాగా.. అందుకు మెట్రో సిబ్బంది నిరాకరించడం గమనార్హం. 

click me!