మేయర్ బొంతు రామోహ్మన్ ఇంట విషాదం...

Published : Oct 13, 2018, 10:28 AM ISTUpdated : Oct 13, 2018, 11:45 AM IST
మేయర్ బొంతు రామోహ్మన్ ఇంట విషాదం...

సారాంశం

హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తోబుట్టువు అనిరెడ్డి సునితారెడ్డి(38) ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. వరంగల్ జిల్లా మొరిపిరాలలోని ఇంట్లో ఉదయం పనుల్లో నిమగ్నమై ఉండగా ఆమెకు గుండె పోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సునీతారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 

హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తోబుట్టువు అనిరెడ్డి సునితారెడ్డి(38) ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. వరంగల్ జిల్లా మొరిపిరాలలోని ఇంట్లో ఉదయం పనుల్లో నిమగ్నమై ఉండగా ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సునీతారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 

సునీతారెడ్డి ప్రస్తుతం మొరిపిరాల గ్రామ రైతు సమన్వయ సమితి సభ్యురాలుగా వున్నారు. ఈమె తన భర్త యాకుబ్ రెడ్డితో కలిసి వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరికి అవినాష్ రెడ్డి, శృతిరెడ్డి ఇద్దరు పిల్లలు.

సోదరి మరణవార్త విని మేయర్ బొంతు రామ్మోహన్ హైదరాబాద్ నుండి హుటాహుటిన మొరిపిరాలకు బయలుదేరారు.  భార్యను కోల్పోయిన బావ యాకూబ్‌ తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ విషయం తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, వికలాంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్‌ వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు సునితారెడ్డి మృతదేహన్ని సందర్శించి నివాళులర్పించారు.   

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు