వేరే కులం వ్యక్తిని ప్రేమించినందుకు.. గుండుగీసి..

Published : Oct 13, 2018, 09:49 AM IST
వేరే కులం వ్యక్తిని ప్రేమించినందుకు.. గుండుగీసి..

సారాంశం

వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించినందుకు నాలుకపై బంగారు తీగతో కాల్చాలని, మరో సారి తప్పు చేయకుండా గుండుగీసి ఊరేగించాలని తీర్మానించారు. 

వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించినందుకు ఆ ఊరి పంచాయితీ ఆమెకు పెద్ద శిక్షే విధించారు. ఆశిక్షను అమలు చేసే లోపు.. పోలీసులు వచ్చి ఆ యువతిని రక్షించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలంలోని బీంరెడ్డిగూడెం గ్రామానికి చెందిన యువతి(18)..రేచపల్లికి చెందిన యువకుడు(20) ప్రేమించుకున్నారు. విషయం ఆర్నెల్ల క్రితం యువతి తాలూకూ కుటుంబ సభ్యులు..ఆ గూడెం వాసుల  దృష్టికి వచ్చింది. యువతి కుటుంబం ఫిర్యాదు మేరకు యువకుడిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని జైలుకు పంపారు. అప్పట్నుంచి తల్లిదండ్రులు కుమార్తెను మరో గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంచారు.

 రెండు రోజుల క్రితం ఆమెను గ్రామానికి తీసుకొస్తుండగా..కుల పెద్దలు అడ్డుకున్నారు. ఈ విషయమై శుక్రవారం పంచాయితీ నిర్వహించారు. గ్రామ కట్టుబాటు తప్పినందుకుగానూ సదరు యువతి కుటుంబానికి రూ.26 వేల జరిమానా విధించారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించినందుకు నాలుకపై బంగారు తీగతో కాల్చాలని, మరో సారి తప్పు చేయకుండా గుండుగీసి ఊరేగించాలని తీర్మానించారు. 

ఈ మేరకు సాయంత్రం పొద్దుపోయాక తీర్పును అమలు చేసేందుకు పెద్దలు సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ రాజయ్య సిబ్బందితో వెళ్లి అడ్డుకున్నారు. యువతి ఫిర్యాదు మేరకు కుల పెద్దలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు