పదేళ్లుగా జీతాలు పెంచలే.. మీరైనా పెంచండి మహా ప్రభో

Published : Aug 23, 2017, 07:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
పదేళ్లుగా జీతాలు పెంచలే.. మీరైనా పెంచండి మహా ప్రభో

సారాంశం

జీతాలు పెంచక పదేళ్లయింది మీరైనా పెంచండి మహా ప్రభో మంత్రి కేటిఆర్ కు మొర పెట్టుకున్న మేప్మా ఉద్యోగులు సిఎం సానుకూల నిర్ణయం తీసుకుంటారన్న కేటిఆర్

పట్టణాల అభివృద్ధిలో మహిళల పాత్రను మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలియజేశారు. ఈరోజు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులతో మంత్రి, ఈ రోజు హైదరాబాదులో సమావేశం అయ్యారు. మెప్మా సంస్థ కింద పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు, కమ్యూనిటీ ఆఫీసర్ల సమస్యల పైన మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. మెప్మా సంస్థ ద్వారా వారికి ఇంకేమీ సహాయ సహకారాలు కావాలో తెలియజేయాలని కోరారు. మెప్మా కింద పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు, ముఖ్యంగా మహిళా సోదరీమణుల సహకారంతో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా పట్టణాల్లో అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని పట్టణాల్లో నివసిస్తున్న పేదల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన పలు కార్యక్రమాలపైన, వారికి అందించాల్సిన సహాయ సహకారాల పైన మంత్రి వివిధ పట్టణాల నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్ లను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్లు, హరితహారం బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా పట్టణాలను ప్రకటించే కార్యక్రమం వంటివి క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరు పైన రిసోర్స్ పర్సన్ లనుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. పలు పురపాలికలు చేపట్టిన తడి - పొడి చెత్త కార్యక్రమాన్ని అమలు చేయడంలో, అక్కడి పట్టణ ప్రజలను చైతన్యవంతం చేయడంలో మెప్మా కీలకపాత్ర పోషించాలని సూచించారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వ వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఈ నేపథ్యంలో వాక్సినేషన్, షౌష్టికాహార కార్యక్రమాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు వంటి వాటి పట్ల పట్టణ ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని కోరారు. మెప్మా పథకం కింద మహిళా సోదరీమణులు చేస్తున్న సేవల గురించి ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉన్నదన్న మంత్రి కేటీ రామారావు, త్వరలోనే మెప్మా ఉద్యోగులతో సమావేశం అవుతారని తెలిపారు.

దాదాపు దశాబ్దకాలం పాటు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల అమలులో క్షేత్ర స్థాయిలో కీలకంగా పనిచేస్తున్నా, తమకు అతి తక్కువ వేతనాలు ఉన్నాయని, వీటిని పెంచాలని రిసోర్స్ పర్సన్లు మంత్రికి విన్నవించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారని, మంత్రి మెప్మా ఉద్యోగులకు హామీ ఇచ్చారు. పట్టణాలు అభివృద్ధి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో మరింత చురుగ్గా పాల్గొనాలని మంత్రి వారిని కోరారు.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

కెసిఆర్ వాగ్దానాల మీద కొత్త జోక్ పేలింది

 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా