అన్నీ ఆంధ్రకే ఇచ్చారు, మాకేమిచ్చారు?

Published : Aug 23, 2017, 06:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
అన్నీ ఆంధ్రకే ఇచ్చారు, మాకేమిచ్చారు?

సారాంశం

విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు అన్నీ ఆంధ్రాకే ఇచ్చారు. మాకేమి ఇచ్చారు? గనులు లేనిచోట ఉక్కు పరిశ్రమ ఇచ్చారు బయ్యారంలో ఇవ్వడంలో తాత్సారం ఎందుకు?

కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ తో పరిశ్రమల శాఖ  మంత్రి కేటీ రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు  పెండింగ్ అంశాల పైన కెటిఅర అరుణ్ కుమా ర్కు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి మంత్రి అరుణ్ కుమార్ తో చర్చించారు.

తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో అన్ని రంగాల్లో వెనకబడిందని అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యధిక సహాయం ఆంధ్ర ప్రదేశ్ కే  చేసిందని, కనీసం విభజన చట్టం లో పేర్కొన్న అంశాలను  సైతం నెరవేర్చడంలో పూర్తిస్థాయిలో సఫలం కాలేదని మంత్రి అరుణ్ కుమార్ తెలియజేశారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరఫున బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసిన ఈ అంశం ఏ మాత్రం ముందుకు కదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎలాంటి ఇనుప ఖనిజాలు లేని వైజాగ్లో steel plant ఏర్పాటు చేసిన కేంద్రం, అవసరమైన మేరకు ఇనుప ఖనిజ నిల్వలు ఉన్న బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో  ఆలస్యం చేస్తున్నదన్నారు.  

అవసరం అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని వెంటనే, స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి మైనింగ్ శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ కు తెలియజేశారు. తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మంలో వెనుకబడిన ప్రాంతంలో యువతకి ఉద్యోగావకాశాలు కల్పించే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అత్యవసరమని, దీనిపైన తెలంగాణ ప్రభుత్వం తమ ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

కెసిఆర్ వాగ్దానాల మీద కొత్త జోక్ పేలింది

 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా