ముగ్గురు విద్యార్థుల మృతి: వేములవాడలో వాగేశ్వరీ స్కూల్ సీజ్

By narsimha lodeFirst Published Aug 29, 2019, 1:30 PM IST
Highlights

వేములవాడలో ముగ్గురు విద్యార్ధులు మృతి చెందిన తర్వాత విద్యాశాఖాధికారులు కళ్లు తెరిచారు. వాగేశ్వరీ స్కూల్ ను  విద్యాశాఖాధికారులు సీజ్ చేశారు. 

వేములవాడ: వేములవాడలోని వాగేశ్వరీ స్కూల్ ను గురువారం నాడు విద్యాశాఖాధికారులు సీజ్ చేశారు. ఈ స్కూల్ కు చెందిన  విద్యార్థులు బుధవారం నాడు జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు మృతి చెందిన విషయం తెలిసిందే.

నిబంధనలకు విరుద్దంగా ఈ స్కూల్ ను నిర్వహిస్తున్నట్టుగా విద్యాశాఖాధికారులు గుర్తించారు. ఈ స్కూల్ కు అనుబంధంగా హాస్టల్‌ను కూడ నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ స్థానిక రాజకీయ పార్టీకి చెందిన నేతగా గుర్తించారు.

వాగేశ్వరీ స్కూల్ తో పాటు  వేములవాడలోని ఇతర స్కూళ్లకు గుర్తింపు ఉందా లేదా అనే విషయమై అధికారులు పరిశీలిస్తున్నారు.  ఈ స్కూల్‌కు షిఫ్టింగ్ పర్మిషన్ లేదు. ఈ విషయమై నాలుగు దఫాలు నోటీసులు జారీ చేసినట్టుగా ఎంఈఓ సురేష్ కుమార్ తెలిపారు.

పదవ తరగతి వరకు ఈ స్కూల్ కు అనుమతి ఉందని సురేష్ కుమార్ తెలిపారు. అయితే  ఈ స్కూల్ షిఫ్టింగ్ కోసం అనుమతి  ఇవ్వలేదన్నారు. ఈ  విషయమై డీఈఓ ఆదేశాల మేరకు స్కూల్ ను సీజ్ చేసినట్టుగా  సురేష్ కుమార్ తెలిపారు.  ఈ స్కూల్ వాణిజ్య సముదాయంలో ఉంది. ఈ స్కూల్ ను మార్చాలని నోటీసులు జారీ చేసిన విషయాన్ని విద్యాశాఖాధికారులు గుర్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వేములవాడలో స్కూల్ వ్యాన్‌ బోల్తా, ముగ్గురు చిన్నారుల దుర్మరణం
 

click me!