పొలం విషయంలో గొడవ.. మహిళను స్థంభానికి కట్టేసి... చెప్పులతో కొట్టి..

Published : Jan 11, 2020, 11:26 AM ISTUpdated : Jan 11, 2020, 11:41 AM IST
పొలం విషయంలో గొడవ.. మహిళను స్థంభానికి కట్టేసి... చెప్పులతో కొట్టి..

సారాంశం

తండాకు చెందిన బాధితురాలు గుగులోత్‌ జ్యోతికి, వీరికి మధ్య పొలానికి వెళ్లే విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం జ్యోతి కి మరో నలుగురు మహిళలతో గొడవ జరిగింది. 

చాలా చిన్న విషయాన్ని పెద్దది చేశారు. పోలానికి ఎవరు వెళ్లాలి అనే విషయం కోసం గొడవ పడి... ఓ మహిళ పట్ల అతి దారుణంగా ప్రవర్తించారు. మహిళను స్తంభానికి కట్టి.. చెప్పులతో కొట్టారు. ఈ దారుణ సంఘటన సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన హంస, జ్యోతి, స్వరూప, రమకు పోరెడ్డిపల్లిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. తండాకు చెందిన బాధితురాలు గుగులోత్‌ జ్యోతికి, వీరికి మధ్య పొలానికి వెళ్లే విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం జ్యోతి కి మరో నలుగురు మహిళలతో గొడవ జరిగింది. 

Also Read మోడల్ పై దారుణం: యువకుడు రేప్ చేస్తుంటే వీడియో తీసిన మిత్రుడు.

ఈ క్రమంలో.. సదరు నలుగురు మహిళలు ఈ విషయాన్ని తమ భర్తలకు తెలియజేశారు. వారు సీన్ లోకి ప్రవేశించి బాధితురాలు జ్యోతి పట్ల దారుణంగా ప్రవర్తించారు. జ్యోతిని  లక్ష్మీపూర్‌ తీసుకెళ్లి.. స్తంభానికి కట్టేసి కొట్టారు. అతి దారుణంగా చెప్పులతో కొట్టారు. గమనించిన ఇతర  గ్రామస్థులు 100కు ఫోన్‌ చేయడంతో కోహెడ్‌ ఎస్సై అక్కడకు చేరుకుని ఆమెను విడిపించి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu