హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మోడల్ పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను రేప్ చేస్తుండగా అతని మిత్రుడు దాన్ని వీడియో తీశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఫిర్యాదు మార్చి రాయలంటూ పోలీసులు ఒత్తిడి పెట్టారని బాధితురాలు శుక్రవారం రాత్రి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఆందుకు సంబంధించిన వివరాలను మోడల్ చెప్పింది. ఆమె చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

మోడలింగ్ రంగంలో స్థిరపడేందుకు నిరుడు హైదరాబాద్ వచ్చిన ఓ యువతి (21) ఎల్లారెడ్డిగూడలోని ఓ హాస్టల్ లో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. హాస్టల్ యజమాని కుమారుడి (17)తో పరిచయం ఏర్పడి, ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. 

నాలుగు నెలల క్రితం ఆ యువతి తన సోదరితో కలిసి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ గది కిరాయికి తీసుకుంది. డిసెంబర్ 28వ తేదీ రాత్రి గంజాయి మత్తులో హాస్టల్ యజమాని కుమారుడు, అతని స్నేహితుడు నిఖిల్ రెడ్డి (19) ఆమె ఉంటున్న గదికి వచ్చారు.

ఆమెపై హాస్టల్ యజమాని కుమారుడు అత్యాచారం చేయగా, నిఖిల్ రెడ్డి సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించి వెళ్లిపోయారు ఆ తర్వాత స్వంత ఊరికి వెళ్లిన యువతి విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు ఆమెకు చెప్పారు. 

ఈ నెల 7వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఎస్సై సుధీర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును మార్చి రాయాలంటూ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ తనపై ఒత్తిడి తెచ్చాడని బాధితురాలు చెప్పింది. చివరకు ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ కె.ఎస్. రావు చెప్పారు. 

ఈ కేసులో నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసం మోడల్ నాటకాలు ఆడుతోందని యువకుని తల్లి ఆరోపించింది. మద్యం తాగించి తనపై అత్యాచారం చేశాడని యువతి ఆోరపిస్తోంది.