తనను ప్రేమించి మరో వ్యక్తితో పెళ్లి.. వరంగల్ యువతి హత్య కేసులో షాకింగ్ విషయాలు

By telugu team  |  First Published Jan 11, 2020, 10:36 AM IST

గతంలో షాహిద్, హారతి మాస్టార్జీ కాలేజీలో చదువుకున్నాడు. షాహిద్ డిగ్రీతో తన చదువును మధ్యలో ఆపేయగా... హారతి మాత్రం తన చదువును కంటిన్యూ చేసింది.కొద్దిరోజుల తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. 


వరంగల్ నగరంలో శుక్రవారం ఓ యువతి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమెను ప్రేమించిన వ్యక్తే... ఆమెను అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆమె హత్య వెనుక గల కారణాలు తాజాగా పోలీసులు బయటపెట్టారు. ప్రేమగా మాట్లాడాలని పిలిచి మరీ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  హన్మకొండ లష్కర్ సింగారం లోని చైతన్యపురి కాలనీకి చెందిన మునిగాల ప్రతాప్, రేణుక దంపతుల కుమార్తె హారతి(26). ఆమె హన్మకొండలోని మాస్టార్జీ కాలేజీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. కాజీపేట విష్ణుపురికాలనీకి చెందిన ఎండీ రజాక్ కుమారుడు షాహిద్ తో హారతికి ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉంది.

Latest Videos

గతంలో షాహిద్, హారతి మాస్టార్జీ కాలేజీలో చదువుకున్నాడు. షాహిద్ డిగ్రీతో తన చదువును మధ్యలో ఆపేయగా... హారతి మాత్రం తన చదువును కంటిన్యూ చేసింది.కొద్దిరోజుల తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. అయితే.. ఇటీవల కాలంలో హారతి మరో యువకుడితో స్నేహంగా ఉండటాన్ని షాహిద్‌ జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. 

AlsoReadవరంగల్‌లో దారుణం: యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది...

దీనికితోడు.. హారతికి సంక్రాంతి తర్వాత వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నట్టు అతడికి తెలిసింది. దీంతో.. తనకు దక్కని అమ్మాయి మరెవరికీ దక్కకూడదనుకున్నాడు. కడుపులో ఎంత విషం ఉన్నా.. పైకి ప్రేమ నటిస్తూ ప్లాన్‌ ప్రకారం మళ్లీ ఆమెకు దగ్గరయ్యాడు. శుక్రవారం హారతికి ఫోన్‌ చేసిన షాహిద్‌.. రాంనగర్‌లోని క్రాంతినగర్‌ కాలనీలో తాను అద్దెకు ఉంటున్న గదికి రావాలని, ఇద్దరం మాట్లాడుకుందామని చెప్పాడు. 

మధ్యాహ్నం 12 గంటల వేళ హారతి రాగా... ఇద్దరూ గదిలో చాలాసేపు మాట్లాడుకున్నారు. 3 గంటల ప్రాంతంలో షాహిద్‌ హారతిపై దాడి చేశాడు. కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో హారతి అక్కడికక్కడే మృతి చెందింది.

కాగా... హత్య చేసిన తర్వాత హారతి జైలుకి వెళ్లి తన తప్పును అంగీకరించడం గమనార్హం.  ముందుగా సెంట్రల్ జైలుకి వెళ్లి హత్య చేశానని చెప్పాడు. అక్కడి సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వెళ్లమని చెప్పారు. ఆ తర్వాత షాహిద్.. తనకు తెలిసిన ఓ న్యాయవాది వద్దకు వెళ్లాడు. అతను కూడా పోలీసులకు లొంగిపోమ్మని సలహా ఇవ్వడంతో.. స్వయంగా తానే వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 

click me!