ఆ దారుణం కలచివేసింది, నిందితులను వదలొద్దు : డీఏవీ స్కూల్ ఘటనపై చిరంజీవి స్పందన

By Siva Kodati  |  First Published Oct 25, 2022, 7:59 PM IST

బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ అత్యాచార ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అన్ని విద్యా సంస్థల్లో యుద్ధ ప్రాతిపదికన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ అత్యాచార ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. పసిబిడ్డపై జరిగిన దారుణం తనను కలచివేసిందన్నారు. నిందితుడికి శిక్షలు పడే విధంగా ప్రభుత్వాలు స్పందించాలని చిరు అన్నారు. అన్ని విద్యా సంస్థల్లో యుద్ధ ప్రాతిపదికన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  భావితరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యత అన్నారు చిరంజీవి.

ఇకపోతే... డీఏవీ స్కూల్ అత్యాచార ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ వేధింపులపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె ఆదేశించారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. 

Latest Videos

ఇదిలావుండగా... డిఏవి పబ్లిక్ స్కూల్ ను ఇక్కడే రీ ఓపెన్ చేయాలని ఇందుకోసం మూడు ఆప్షన్లు ఇస్తూ తల్లిదండ్రులు అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం బంజారాహిల్స్ లోని కెబిఆర్ పార్కు వద్ద డి ఏవి స్కూల్ కు చెందిన సుమారు 200మంది తల్లిదండ్రులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తాము మూడు ఆప్షన్లు ఇస్తున్నామన్నారు.

ALso Read:డీఏవీ స్కూల్ నే రీ ఓపెన్ చేయాలి.. మా పిల్లల్ని వేరే స్కూల్స్ కు పంపం.. తల్లిదండ్రుల అల్టిమేటం...

చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఒక అధికారి, పేరెంట్స్ కమిటీ నుంచి ఒకరు, ప్రభుత్వం నుంచి మరొకరు, స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఒకరు చొప్పున కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడే స్కూల్ తెరవాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రెండు ఆప్షన్లకు ఏ రకంగానూ తాము ఒప్పుకోవడం లేదని అన్నారు. సీబీఎస్ఈ విద్యార్థులను స్టేట్ సిలబస్ పాఠశాలల్లోకి చేర్చడం కుదరని పని అని అన్నారు. మెరీడియన్ స్కూల్లో చేర్చడానికి కూడా అది తాహతుకు మించిన వ్యవహారం అవుతుందని తల్లిదండ్రులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. తల్లిదండ్రులు అభిప్రాయం తీసుకుని ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.

కాగా... బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపాల్ గదికి పక్కనే ఈ దారుణం జరిగినా ప్రిన్సిపాల్ మాధవి నిరోధించకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రజనీ కుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ ఎస్ మాధవీపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరిద్దరికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. 

 

Let such Horrors not recur ever again! pic.twitter.com/s1tzujCevh

— Chiranjeevi Konidela (@KChiruTweets)
click me!