ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ కంగ్రాట్స్

Published : Oct 25, 2022, 07:20 PM IST
ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ కంగ్రాట్స్

సారాంశం

సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ పొంది 50 మంది ఇటీవలే నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ట్వీట్ చేయగా.. మంత్రి కేటీఆర్ వారందరికీ కంగ్రాట్స్ చెబుతూ ట్విట్టర్‌లో స్పందించారు.  

హైదరాబాద్: సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ పొందిన కొందరు అభ్యర్థులు ఇటీవలే నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్, పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. అందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టారు. ప్రిలిమ్స్‌లో మొత్తం 50 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. వారందరికీ కేటీఆర్ కంగ్రాట్స్ తెలుపుతూ ట్వీట్ పెట్టారు.

మంగళవారం సాయంత్రం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ విధంగా పోస్టు పెట్టారు. కేటీఆర్ గారి ప్రత్యేక చొరవతో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పడిందని వివరించారు. ఈ స్టడీ సర్కిల్‌లో నిరుద్యోగ యువత ఉచితంగా శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఈ ఉచిత శిక్షణ పొంది ఎస్ఐ (21), కానిస్టేబుల్ (29)లలో కలిపి మొత్తం 50 మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. ఇదే ఉత్సాహంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కొనసాగిస్తారని ఆశించారు. అలాగే, తుది పరీక్షల్లోనూ విజేతలు కావాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి