మందులు వేసుకోవాల్సి వస్తుందని, మర్మాంగం కోసుకుని.. వైద్య విద్యార్థి ఆత్మహత్య.. !

Published : Jul 10, 2023, 06:44 AM IST
మందులు వేసుకోవాల్సి వస్తుందని, మర్మాంగం కోసుకుని.. వైద్య విద్యార్థి ఆత్మహత్య.. !

సారాంశం

సికింద్రాబాద్ లో ఓ మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. మర్మాంగాన్ని కోసుకుని మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఆదివారం నాడు ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న దీక్షిత్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.  అతనికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన ఇంట్లోనే దీక్షిత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిమీద మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీసులు వివరాలు తెలిపారు.. 

దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు సోమిరెడ్డి, కరుణ. వీరిది ఉమ్మడి వరంగల్ జిల్లా దేవరుప్పుల గ్రామం. వారు అక్కడి నుంచి 20 ఏళ్ల క్రితం హైదరాబాదు శివారులోని పాపిరెడ్డి నగర్ కి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు దీక్షిత్ రెడ్డి మెడిసిన్ చదువుతున్నాడు. దీక్షిత్ రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదు. దీంతో గతంలో కూడా ఒకసారి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు గమనించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

బాలానగర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. అపార్ట్ మెంట్ లో ఎగసిపడుతున్న మంటలు.. భయాందోళనలో స్థానికులు..

దీంతో తల్లిదండ్రులు అతనికి మెరుగైన చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే మందులు తీసుకోవాల్సి వస్తుందని దీక్షిత్ రెడ్డి మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే దీక్షిత్ రెడ్డి బలవన్మరణం చెందాడు. సాయంత్రం ఐదుగంటలకి కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు పెట్టి ఉన్నాయి.. దీక్షిత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నా ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తీయలేదు. 

దీంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా దీక్షిత్ రెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు108కి  ఫోన్ చేశారు. వారు వచ్చి చూసేసరికి దీక్షిత్ రెడ్డి మర్మాంగం కోసుకున్నట్లు తేలింది. అప్పటికే అతను మృతి చెందాడని 108 సిబ్బంది తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Interview: ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu