
Balanagar:హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆదివారం నగరంలోని బాలానగర్ పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థా ఏ2ఏ లైఫ్ స్పే అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్రమంగా అవి షాప్ మొత్తానికి విస్తరించడటంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఆ క్రమంలో అక్కడ నివస్తున్న ప్రజలు భయాందోళనలకు లోనయారు. అక్కడ పరుగులు దీశారు. మఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
అపార్ట్ మెంట్ లో రాత్రి 9గంటల ప్రాంతంలో మంటలు ఎగిసిపడినట్టు తెలుస్తోంది. అపార్ట్ మెంట్ 5వ ఫ్లోర్ లో ప్రమాదం జరిగింది. ఓ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా తగలబడ్డాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.