లైంగిక వేధింపుల ఆరోపణలు: రిమ్స్ డైరెక్టర్‌పై ప్రభుత్వానికి నివేదిక

First Published Jul 10, 2018, 1:30 PM IST
Highlights

ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ ఆశోక్ పై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి ప్రబుత్వానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం. మహిళా డాక్టర్లను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆయనపై తాజాగా ఆరోపణలు వెలుగు చూశాయి.


ఆదిలాబాద్:  ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ ఆశోక్‌ తీరుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం. రిమ్స్ డైరెక్టర్  ఆశోక్ తీరుపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  ఆశోక్ కు రాజకీయ అండ ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్‌ తీరుపై  కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. ఆశోక్ ను విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేస్తోంది. ఆశోక్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని  కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే తాజాగా మహిళా డాక్టర్లపై రిమ్స్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి.

ఈ విషయమై  విచారించినట్టు ప్రచారం సాగుతోంది.  మహిళా డాక్టర్ల రంగు, రూపు రేఖల విషయంలో డైరెక్టర్ కామెంట్స్ చేసేవాడని ప్రచారం సాగుతోంది. ఈ విషయాలపై  ప్రభుత్వానికి   వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  శాంతకుమారి నివేదిక పంపినట్టు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

అయితే  రాజకీయంగా జిల్లాకు చెందిన ఓ మంత్రి  అండ రిమ్స్ డైరెక్టర్ కు ఉందని ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు  గుర్తు చేస్తున్నారు.  అయితే రాజకీయ అండ కారణంగానే రిమ్స్ డైరెక్టర్ పదవి నుండి ఆశోక్ ను తప్పించడం లేదని విపక్షాలు  ఆరోపణలు చేస్తున్నాయి.

click me!