కొనసాగుతున్న జే,ఎల్ బ్లాకుల కూల్చివేత పనులు:20 నిమిషాలు మీడియా కవరేజీ

By narsimha lodeFirst Published Jul 27, 2020, 5:07 PM IST
Highlights

తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మీడియాను తీసుకెల్లింది.
 


హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మీడియాను తీసుకెల్లింది.

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనుల కవరేజీకి తీసుకెళ్తామని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం నాడు ఉదయం ప్రకటించారు. మరోవైపు హైకోర్టులో మీడియా ప్రతినిధులకు ఇవాళ సచివాలయం కూల్చివేత పనులను చూపుతామని హైకోర్టులో ప్రభుత్వం తెలిపింది.

హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో మీడియాను సచివాలయంలోకి తీసుకెళ్లారు. సోమవారం నాడు ఎల్ బ్లాక్ కూల్చివేత పనులు సాగుతున్నాయి. ఎల్ బ్లాక్ పక్కనే ఉన్న భవనాలను కూల్చివేశారు.

also read:తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి సర్కార్ నో: అనుమానాలకు తావిస్తోందన్న హైకోర్టు

సౌత్ హెచ్ బ్లాక్, నార్త్ బ్లాక్ భవనాలు నేలమట్టమయ్యాయి. సచివాలయం ఆవరణలో పెద్ద ఎత్తున శిథిలాలు పేరుకుపోయాయి.  ప్రతి రోజూ  పెద్ద ఎత్తున టిప్పర్ల ద్వారా వ్యర్థాలను  తొలగిస్తున్నారు.

జే, ఎల్ బ్లాకుల కూల్చివేతలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ రెండు భవనాల కూల్చివేతలు దాదాపుగా 60 శాతం పూర్తయ్యాయి. నాలుగైదు రోజుల్లో ఈ రెండు భవనాలు పూర్తి చేసే అవకాశం ఉంది.

వీఐపీ కవరేజీ సమయంలో మీడియా ప్రతినిధులకు ఉపయోగించే వ్యాన్ ను కెమెరామెన్ల కోసం ఏర్పాటు చేశారు. ఒకే వాహనంలో కిక్కిరిసిపోయి కెమెరామెన్లు ఆ వాహనంలో ఉన్నారు. కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా కెమెరామెన్లను ఒకే వాహనంలో తీసుకెళ్లారు. దీనిపై మీడియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భవనాలు కూల్చివేత సమయంలో దుమ్ము, ధూళితో ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకొంది. సుమారు 20 నిమిషాల లోపు మీడియా సచివాలయం కూల్చివేత ప్రాంగణంలో ఉంది. మీడియాను పోలీసులు దగ్గరుండి తీసుకెళ్లి, తీసుకొచ్చారు.


 

click me!