మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంటికి మేడ్చల్ డీసీపీ సందీప్ ఇవాళ వెళ్లారు. ఆ సమయంలో ఈటల రాజేందర్ ఇంట్లో లేరు.
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంటికి మేడ్చల్ డీసీపీ సందీప్ బుధవారంనాడు వెళ్లాడు.మాజీ మంత్రి ఈటల రాజేందర్ హత్యకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సుఫారీ ఇచ్చినట్టుగా ఈటల జమున ఆరోపించారు. ఈ ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈటల రాజేందర్ భద్రత విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు . బుధవారంనాడు తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ తో మంత్రి కేటీఆర్ ఫోన్ లో మాట్లాడారు. ఈటల రాజేందర్ భద్రత విషయంలో సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దీంతో డీజీపీ ఆదేశాల మేరకు మేడ్చల్ డీసీపీ సందీప్ ఇవాళ షామీర్ పేటలోని ఈటల రాజేందర్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. మేడ్చల్ డీసీపీ సందీప్ ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లిన సమయంలో రాజేందర్ ఇంట్లో లేరు. దీంతో డీసీపీ వెళ్లిపోయారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను చంపేందుకు సుఫారీ ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో రాజేందర్ భద్రత విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాజేందర్ కు ఏదైనా జరిగితే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నందున బీఆర్ఎస్ సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటుంది. సుఫారీ ఆరోపణలతో ఈటల రాజేందర్ కు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రతను కేటాయించాలని భావిస్తుందని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో ఈటల రాజేందర్ కు భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
undefined
also read:ఈటల రాజేందర్ భద్రతపై కేటీఆర్ ఆరా: డీజీపీకి మంత్రి ఫోన్
తనను చంపేందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సుఫారీ ఇచ్చారని ఈటల రాజేందర్ ఇవాళ కూడ ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ లో ఉండేవారు . భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం ఈటల రాజేందర్ పై వేటేసింది. ఆ తర్వాత రాజేందర్ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరే ముందు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ విజయం సాధించారు.