ఖమ్మంలో కాంగ్రెస్ సభ: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ కానున్న ఠాక్రే

By narsimha lode  |  First Published Jun 28, 2023, 2:24 PM IST

ఖమ్మంలో  నిర్వహించనున్న కాంగ్రెస్ సభ విషయమై  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో  ఆ పార్టీ నేత మాణిక్ రావు ఠాక్రే చర్చించనున్నారు.


హైదరాబాద్: సీఎల్పీ నేత  మల్లు భట్టి విక్రమార్కతో  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ  రాష్ట్ర ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే  బుధవారంనాడు  భేటీ కానున్నారు. జూలై రెండున ఖమ్మంలో  నిర్వహించే  సభ విషయమై  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో  మాణిక్ రావు ఠాక్రే చర్చించనున్నారు.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  ప్రస్తుతం  పాదయాత్ర  నిర్వహిస్తున్నారు. ఉమ్మడి  నల్గొండ  జిల్లాల్లో  బుధవారంనాడు  మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర  ముగిసింది.  ఇవాళ మధ్యాహ్నం తర్వాత  భట్టి విక్రమార్క  ఉమ్మడి  ఖమ్మం జిల్లాల్లో  ప్రవేశించనుంది.  పాలేరు  అసెంబ్లీ  నియోజకవర్గం గుండా  ఉమ్మడి  ఖమ్మం జిల్లాలోకి  భట్టి విక్రమార్క  పాదయాత్రముగియనుంది. 

Latest Videos

ఉమ్మడి  ఖమ్మం  జిల్లాకు  చెందిన  మాజీ ఎంపీ  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో  చేరనున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని  నిర్వహించే సభలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో  చేరే అవకాశం ఉంది.  ఈ విషయమై  నిన్న  కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ సమావేశంలో  చర్చించారు. ఈ సమావేశంలో  పార్టీ నేతలు  పలు రకాల  అభిప్రాయాలను వ్యక్తం  చేశారు. ఈ సమావేశంలో వ్యక్తమైన  అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న  పార్టీ నాయకత్వం  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో  చర్చించనున్నారు.పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే ఇవాళ మల్లు భట్టి విక్రమార్కతో భేటీ కానున్నారు.  

రాహుల్ గాంధీ  నిర్వహించిన  భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా  ఆయా జిల్లాల్లో  కాంగ్రెస్ నేతలు  పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర  తొలి విడత  పూరైంది. రెండో విడతను కూడ ప్రారంభించనున్నట్టుగా  రేవంత్ రెడ్డి  ప్రకటించారు. ఈ లోపుగా  మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్ర  ప్రారంభమైంది.

click me!