ఆదాయపన్ను రీఫండ్ స్కాం:హైద్రాబాద్, విజయవాడల్లో ఐటీ అధికారుల తనిఖీలు

Published : Jun 29, 2023, 10:27 AM ISTUpdated : Jun 29, 2023, 10:34 AM IST
ఆదాయపన్ను రీఫండ్ స్కాం:హైద్రాబాద్,  విజయవాడల్లో  ఐటీ అధికారుల తనిఖీలు

సారాంశం

ఆదాయపన్ను శాఖలో రీఫండ్ స్కాం జరిగిన విషయాన్ని ఆ  శాఖాధికారులు గుర్తించారు. ఈ విషయమై  ఐటీశాఖాధికారులు సోదాలు  నిర్వహిస్తున్నారు. 

హైదరాబాద్:  ఆదాయపన్ను శాఖలో రీ ఫండ్ స్కాంను  ఆ శాఖాధికారులు గుర్తించారు.  రూ. 40 కోట్ల రీఫండ్ స్కాం జరిగిందని  హైద్రాబాద్ లోని ఐటీ శాఖాధికారులు గుర్తించారు.  ఈ విషయమై  హైద్రాబాద్, విజయవాడలో  ఐటీ అధికారులు సోదాలు  నిర్వహిస్తున్నారు.

ఆదాయపన్ను రీఫండ్ విషయమై  కన్సల్టెంట్లు, ఏజంట్లకు  10 శాతం  కమీషన్ దక్కిందని  ఐటీ శాఖాధికారులు గుర్తించారు. ఈ విషయమై  ఆదాయపన్ను శాఖాధికారులు తనిఖీలు చేస్తున్నారు.  ఎనిమిది మంది  టాక్స్ కన్సల్టెంట్లు  ఈ స్కాంలో  పాలుపంచుకున్నారని  అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణానికి సంబంధించి  ఐటీ అధికారులు సోదాలు  చేస్తున్నారు.2017లో  కూడ ఇదే తరహా మోసాన్ని ఐటీ శాఖాధికారులు  గుర్తించారు.  సాఫ్ట్ వేర్ ఉద్యోగులు  తప్పుడు పత్రాలతో  ఐటీ శాఖ నుండి  రీఫండ్ పొందిన విషయాన్ని ఐటీ శాఖాధికారులు గుర్తించారు.తమ  కుటుంబ సభ్యులకు చికిత్స కోసం  డబ్బులు ఖర్చు చేసినట్టుగా  తప్పుడు ధృవీకరణ పత్రాలతో  ఐటీ శాఖ నుండి రీఫండ్  పొందారని  ఐటీ శాఖాధికారులు గుర్తు చేస్తున్నారు.

2017లో జరిగిన ఈ స్కాం విషయమై  ఆదాయ శాఖ  కన్సల్టెంట్ సంస్థలు, ఏజంట్లపై  కేసులు నమోదు చేశారు.తాజాగా  చోటు  చేసుకున్న  ఆదాయపన్ను శాఖ రీఫండ్  కుంభకోణానికి సంబంధించి నిజాంపేట్, ఎల్ బీ నగర్,  వనస్థలిపురం ప్రాంతాల్లో  ఐటీ శాఖాధికారులు  నిన్న  సోదాలు నిర్వహించారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!