
ప్రపంచంలోనే అతిపెద్ద జాతరలో ఒకటిగా పేరున్న మేడారం జాతర తేదీలు ఖరారయ్యాయి. రెండేళ్లకోసారి అత్యంత భారీ స్థాయిలో జరిగే ఈ జాతరకు దేశమొత్తం నుంచి భక్తులు తరలివస్తుంటారు.
కుంభ మేళా తర్వాత ఆ స్థాయిలో జనాలందరూ ఒక్కచోటకు వచ్చే అతి పెద్ద జాతరగా దీనికి పేరుంది.
రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ఏర్పాటు అయ్యాక జరగనున్న తొలి జాతర ఇదే. వచ్చే ఏడాదిలో ఏ రోజు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించాలనేది పూజారులు నిర్ణయించారు. 2018 జనవరి 31నజాతర ప్రారంభించి అదే రోజు సారలమ్మను గద్దెకు తీసుకవస్తారని పూజారులు తెలిపారు.
ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 1న ఆనవాయితీగా సమ్మక్క గద్దెకు వస్తుందన్నారు. ఫిబ్రవరి 2న భక్తుల మొక్కులు చెల్లిస్తారని, ఫిబ్రవరి 3న అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారని పేర్కొన్నారు.