కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి: రాజు మొబైల్ డేటాను పరిశీలించనున్న పోలీసులు

By narsimha lode  |  First Published Oct 31, 2023, 9:25 AM IST


మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిపై దాడి చేసిన రాజు మొబైల్ కాల్ డేటాను పోలీసులు సేకరించనున్నారు.


హైదరాబాద్: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన  రాజు అనే వ్యక్తి  మొబైల్ కాల్ డేటాను  పోలీసులు పరిశీలించనున్నారు.  ఈ నెల  30న  దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో  ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని  తిరిగి వెళ్తున్న సమయంలో  దుబ్బాక  బీఆర్ఎస్ అభ్యర్ధి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన  ప్రభాకర్ రెడ్డి గన్ మెన్  దాడిని అడ్డుకున్నారు.
లేకపోతే  ప్రభాకర్ రెడ్డికి  తీవ్ర గాయాలై ఉండేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

ఈ దాడితో ఆగ్రహంతో  రాజును  బీఆర్ఎస్ కార్యకర్తలు  పట్టుకుని చితకబాదారు. పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని రాజును  అదుపులోకి తీసుకున్నారు.  తీవ్రంగా గాయపడిన  రాజును సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో  రాజు చికిత్స పొందుతున్నారు.  గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  రాజు నుండి పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు.  మరో వైపు  వారం రోజులుగా  రాజు ఎవరెవరితో మాట్లాడారనే విషయమై  పోలీసులు  ఆరా తీయనున్నారు. రాజు ఉపయోగించిన మొబైల్ ఫోన్ కాల్ డేటాను  పరిశీలించనున్నారు.  కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి వెనుక కుట్ర కోణం ఉందా, లేక ఇతరత్రా కారణాలున్నాయా అనే  కోణంలో  పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

Latest Videos

undefined

కొత్త ప్రభాకర్ రెడ్డికి సికింద్రాబాద్  యశోద ఆసుపత్రిలో  సోమవారంనాడు రాత్రి శస్త్ర చికిత్స నిర్వహించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని  నిన్న రాత్రి  సీఎం కేసీఆర్ పరామర్శించారు.  కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  

also read:కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపులో ఆరు సెం.మీ. కత్తిగాటు: హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి ఘటనపై  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  విచారం వ్యక్తం చేశారు.ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డీజీపీని  గవర్నర్ ఆదేశించారు.   కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని  కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ఖండించాయి.

click me!