రూ. 40 లక్షల లంచం: మెదక్ అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురి అరెస్ట్

Published : Sep 09, 2020, 07:46 PM IST
రూ. 40 లక్షల లంచం: మెదక్ అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురి అరెస్ట్

సారాంశం

 లంచం కేసులో మెదక్ అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం నాడు ఉదయం రూ. 40 లక్షలు లంచం తీసుకొంటూ అదనపు కలెక్టర్ నగేష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.  

హైదరాబాద్: లంచం కేసులో మెదక్ అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం నాడు ఉదయం రూ. 40 లక్షలు లంచం తీసుకొంటూ అదనపు కలెక్టర్ నగేష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి, చిల్పిచేడు ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్, అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీ కోలా జీవన్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ వసీంలను ఏసీబీ ఇవాళ సాయంత్రం అరెస్ట్ చేశారు. 

also read:రూ. 40 లక్షల లంచం: మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అరెస్ట్ కు రంగం సిద్దం

రెండు దఫాలుగా రూ. 19.5 లక్షలు, రూ. 25.5లక్షలు తీసుకొన్న మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్. మరో రూ. 72 లక్షలు ఇవ్వాల్సిన బాధితుడు. ఈ 72 లక్షలకు బదులుగా ఐదు ఎకరాల భూమిని బినామీ పేరిట అగ్రిమెంట్ చేయించుకొన్న అడిషనల్ కలెక్టర్ నగేష్.

అడిషనల్ కలెక్టర్ నగేష్ కు బినామీగా కోలా జీవన్ గౌడ్ ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. డబ్బలను బీనామీగా ఉన్న జీవన్ గౌడ్ పేరిట నగేష్ తీసుకొన్నట్టుగా ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.

ఈ డీల్ కుదిర్చినందుకు గాను జూనియర్ అసిస్టెంట్ వసీం రూ. 5 లక్షలు తీసుకొన్నాడు.  ఆర్డీవో కు రూ. లక్ష, ఎమ్మార్వోకు రూ. 1 లక్ష జూనియర్ అసిస్టెంట్ వసీం ఇచ్చాడు.నర్సాపూర్ మండలం చిప్పలకుర్తిలో 113 ఎకరాల భూమికి నో అబ్జకేషన్ సర్టిఫికెట్ కోసం అడిషనల్ కలెక్టర్ లంచం డిమాండ్ చేసినట్టుగా బాధితుడు  ఆరోపిస్తున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu