Hyderabad drinking water : హైదరాబాద్ కు జనాభాకు సరిపోయే నీటిని అందించేందుకు చర్యలు - మంత్రి తలసాని

By team teluguFirst Published May 14, 2022, 1:25 PM IST
Highlights

హైదరాబాద్ భవిష్యత్ తరాలకు కూడా నీటిని అందించే విధంగా ఇప్పటి నుంచే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సుంకిషాల లో ఇంటెక్ వెల్ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. 

పెరుగుతున్న హైదరాబాద్ నగర జనాభా అవసరాలకు సరిపోయేంతా నీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. శనివారం ఆయన సుంకిషాల లో ఇంటెక్ వెల్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. 

పోలీస్‌ కొలువులకు దరఖాస్తు గడువు పొడిగించేది లేదు : టీఎస్ ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ శ్రీనివాసరావు

హైద‌రాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో నగరంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలను తెలంగాణ ప్ర‌భుత్వం క‌ల్పిస్తోంద‌ని చెప్పారు. ప్ర‌స్తుత అవ‌స‌రాలే గాక‌.. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను కూడా ప్ర‌భుత్వం దృష్టిలో ఉంచుకుంటోంద‌ని తెలిపారు. అందులో భాగంగా భ‌విష్య‌త్ త‌రాల‌కు ఎలాంటి నీటి ఇబ్బందీ త‌లెత్త‌కుండా నాగార్జున సాగర్ వద్ద ఇన్ టెక్ వెల్ నిర్మాణం చేప‌ట్టామ‌ని తెలిపారు. 

Hyderabad Crime: అపార్ట్ మెంట్ టెర్రస్ పై 12ఏళ్ల బాలిక మృతదేహం... హత్యాచారమేనా?

గతంలో తాగునీటి కోసం తెలంగాణ మ‌హిళ‌లు అనేక చోట్ల ఆందోళ‌న, నిర‌స‌న‌లు చేసేవార‌ని తెలిపారు. కానీ ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం వేస‌వి కాలంలో కూడా ప్ర‌జ‌ల‌కు తాగు నీటి స‌మ‌స్య‌లు లేవ‌ని తెలిపారు. ఈ ఘ‌నత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు ద‌క్కుతుంద‌ని కొనియాడారు. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ సిటీ అద్భుతంగా అభివృద్ది చెందుతోంద‌ని తెలిపారు.

click me!