కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనక రహస్యమేమిటి..?: అమిత్ షాకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

By Sumanth KanukulaFirst Published May 14, 2022, 1:22 PM IST
Highlights

కేంద్ర హోం మంత్రి అమిత్ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే తెలంగాణ పర్యటనకు వస్తున అమిత్‌ షా‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. అయితే తెలంగాణ పర్యటనకు వస్తున అమిత్‌ షా‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో 9 ప్రశ్నలను సంధించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనక రహస్యమేమిటని ఈ లేఖలో రేవంత్ రెడ్డి.. అమిత్ షా‌ను ప్రశ్నించారు.

పంట కొనుగోలు చేయకుండా ఆడిన రాజకీయ డ్రామాలో.. ధాన్యం రైతుల మరణాలకు భాద్యులెవరో సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటుపై అనుచితంగా మాట్లాడిన మోదీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో పసుపు  బోర్డు అంటూ బీజేపీ మాట తప్పిందని విమర్శించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 

దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన భద్రాద్రి రాముడికి.. రామాయణం సర్క్యూట్‌లో చోటు ఏదని ప్రశ్నించారు. అయోధ్య రాముడు.. భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒకటి కాదా అంటూ ప్రశ్నలు సంధించారు. 


అమిత్ షా షెడ్యూల్ ఇదే.. 
నేటి మధ్యాహ్నం 2.30కి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేరుకుంటారు. ముందుగా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు హోటల్ కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు తుక్కుగుడలో జరిగే భారీ బహిరంగ సభకు ఆయ‌న హాజ‌రవుతారు. అక్క‌డ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. రాత్రి 8.25 గంటలకు ఢిల్లీకి బయల్దేరి వెళతారు. 

ఇక, అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణ వేడెక్కింది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం  మొదలైంది. ఈ క్రమంలో అమిత్ షాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీకి కక్ష, వివక్ష అలానే ఉందని మంత్రి ఆరోపించారు. కేందం కడుపునింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదని ఫైరయ్యారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా అమిత్ షాపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

click me!