భద్రాద్రి జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా.. ఆత్మహత్యకు యత్నించిన యువకుడి తల్లి

Published : May 14, 2022, 01:01 PM IST
భద్రాద్రి జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా.. ఆత్మహత్యకు యత్నించిన యువకుడి తల్లి

సారాంశం

భదాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు‌ మండలం సారపాకలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన కొడుకు మోసం చేశాడని ఓ యువతి ఇంటి ముందు ధర్నా చేయడాన్ని అవమానంగా భావించిన మహిళ పురుగుల మందు తాగింది. 

భదాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు‌ మండలం సారపాకలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన కొడుకు మోసం చేశాడని ఓ యువతి ఇంటి ముందు ధర్నా చేయడాన్ని అవమానంగా భావించిన మహిళ పురుగుల మందు తాగింది. వివరాలు.. సారపాకలో కిరణ్ అనే యువకుడి ఇంటి ముందు ఓ యువతి ధర్నాకు దిగింది. కిరణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని  ఆరోపిస్తూ యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే యువతి, ఆమె బంధువులు కిరణ్ ఇంటి ముందు బైఠాయించారు. 

అయితే యువతి, ఆమె బంధువులు తమ ఇంటి ముందు ధర్నా చేయడాన్ని కిరణ్ తల్లి జ్యోతి అవమానంగా భావించింది. ఈ క్రమంలోనే జ్యోతి పురుగుల మందు తాగింది. దీంతో జ్యోతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?