యావత్ తెలంగాణనే రీ‌-డిజైన్ చేస్తున్న కేసీఆర్ కే... హుజురాబాద్ ప్రజల ఓటు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

By Arun Kumar PFirst Published Oct 1, 2021, 11:00 AM IST
Highlights

యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రీ-డిజైన్ చేస్తున్నారని... ఆయనకే హుజురాబాద్ ప్రజలు మద్దతుగా నిలుస్తారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్నే రీ- డిజైన్ చేసే బృహత్తరమైన పనిలో వున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. కాబట్టి హుజురాబాద్ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతిస్తారని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ప్రజలు ఓటేసేది కేసీఆర్ కు, ఆయన పాలనకేనని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. 

తెలంగాణ అసెంబ్లీకి వెళ్లేముందు గన్ పార్క్ వద్దకు వచ్చిన ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలు ఛత్తీస్ ఘడ్, పంజాబ్ లో ప్రభుత్వాలు కల్లోలంలో వున్నాయన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో సుస్థిరమైన పాలన అందిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని ఎన్ని రోజులైనా నడుపుతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారని ముత్తిరెడ్డి గుర్తుచేశారు. 

''తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రధానితో పాటు కేంద్ర కేబినెట్ సైతం ప్రశంసలు కురిపించింది. అలాంటి సుపరిపాలిత రాష్ట్రానికి కేంద్రం మెడికల్ కాలేజిలు ఎందుకు ఇవ్వడంలేదు? బీజేపీ నేతలు తెలంగాణకు మెడికల్ కాలేజీలు తెప్పిస్తారా?'' అని ఎమ్మెల్యే నిలదీశారు. 

read more  Huzurbad Bypoll: గెల్లుకు టీఆర్ఎస్ బీఫామ్, రూ.28లక్షల చెక్... అందజేసిన కేసీఆర్ (వీడియో)

''తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కి దమ్ముంటే డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇవ్వండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేవలం చెయ్యి ఊపడం కాదు... రాష్ట్రానికి కేంద్రం నుండి ఏం చేస్తారో, ఏం తెస్తారో చెప్పాలి? తెలంగాణ సొమ్ము కేంద్రం దగ్గర లక్షా 40వేల కోట్లు ఉన్నాయి. ఆ నిధులు ఎప్పుడిస్తారో చెప్పాలి'' అని ముత్తిరెడ్డి డిమాండ్ చేశారు. 

''రాష్ట్రం అంతటా తిరుగుతున్న బండి సంజయ్ హుజురాబాద్ కు ఎందుకు రావడం లేదు. నేను ఉద్దండున్ని అని చెప్పుకునే మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై చిన్న పిలగాడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలవబోతున్నాడు" అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

click me!