
రైతులకు నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మే షాపులు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
కేసులు నమోదు చేపి లైసెన్సులు రద్దు చేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. శుక్రవవారం మంత్రి సంగారెడ్డిలోని కలక్టరేట్ కార్యాలయంలో యాసంగి సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... త్వరలో 1000 ఈవో పోస్టుల నియామకం చేపడుతామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి 2 వేల హెక్టార్లకు ఒక ఈవో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే కొత్తగా మరో 1000 ఈవో పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఇకపై ఈవోలు అందరూ స్థానికంగా రైతులకు అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అలాగే, సహకార సంఘాలను పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.