గుండెపోటుతో కుప్పకూలి ఎంబీఏ విద్యార్థి మృతి...

Published : Aug 01, 2023, 10:48 AM IST
గుండెపోటుతో కుప్పకూలి ఎంబీఏ విద్యార్థి మృతి...

సారాంశం

హైదరాబాద్ లో ఓ ఎంబీఏ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. అర్థరాత్రి 2 గం.ల ప్రాంతంలో బాత్రూంకు వెడదామని లేచిన అతనికి గుండెలో తీవ్రంగా నొప్పి రావడంతో మృతి చెందాడు. 

హైదరాబాద్ : ఇటీవలి కాలంతో గుండెపోటుతో మరణిస్తున్న యువత సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా అలాంటి ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ ఎంబీఏ విద్యార్థి హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడు.  దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ గ్రామానికి చెందిన రమేష్ కుమారుడైన కొత్తపల్లి కుశాల్ ఎంబీఏ చదువుతున్నాడు. మైసమ్మగూడలోని సాత్విక్ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్నాడు. కుశాల్ స్నేహితుడు సత్య గిరీష్.. సాయిమణి బాయ్స్ హాస్టల్ లో ఉంటున్నాడు.

కడెం ప్రాజెక్టు మూడు పిల్లర్లకు పగుళ్లు: నిపుణుల కమిటీ కీలక నివేదిక 

ఆదివారం కుశాల్ సత్య గిరిష్ ఉంటున్న హాస్టల్ కు వెళ్ళాడు. అక్కడే నిద్రపోయాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాత్ రూమ్ కు వెళ్దామని లేచిన కుషాల్.. ఒక్కసారిగా  గుండె నొప్పితో.. కుప్పకూలిపోయాడు.

ఈ మేరకు సమాచారం పేట్ బషీరాబాద్ పోలీసులకు అందడంతో.. హాస్టల్కు చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం కుషాల్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని మరణంపై మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu