హైదరాబాద్ మేయర్ గుజరాత్ లో ఏం చేశారో తెలుసా?

Published : Jul 03, 2017, 02:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
హైదరాబాద్ మేయర్ గుజరాత్ లో ఏం చేశారో తెలుసా?

సారాంశం

ఆయన హైదరాబాద్ మేయర్. విశాలమైన భాగ్య నగరానికి ఆయన ప్రథమ పౌరుడు. కానీ ఆయన గుజరాత్ వెళ్లారు. గుజరాత్ పర్యటనలో ఏం చేశాడో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. 

జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు సైతం ఆ టూర్ లో ఉన్నారు.

 

గుజరాత్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.  వర్షంలో వెళ్లేటప్పుడు పర్యటనకు వెళ్లిన వారంతా గొడుగులు పట్టుకుని తిరిగారు.

 

ఒకచోట మాత్రం  మంత్రి కెటిఆర్ ను పాఠశాల చిన్నారులు కలిశారు. ఈ సమయంలో కెటిఆర్ చేతిలో ఉన్న గొడుగును తీసుకుని తన గొడుగు, కెటిఆర్ గొడుగు రెండూ మేయర్ బొంతు చేతిలో పట్టుకున్నారు.

 

ఈ సందర్భంగా తీసిన ఫొటోను మీడియాకు విడుదల చేశారు.

 

దీంతో ఎంతటి మేయర్ అయినా అంతగా స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారేంటబ్బా అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

 

సెక్యూరిటీ వాళ్లు ఉండగా మేయర్ అంతగా ఎందుకు ఉచిత సేవలు చేస్తున్నారని ప్రశ్నల పరంపర కొనసాగుతోంది.

 

ఎంతైనా పార్టీ  అధినేత కొడుకు కదా ఆమాత్రం గొడుగు పట్టుకుంటే ఏమైనా నేరమా అన్న సమాధానాలు కూడా వస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే