అలా చేస్తేనే.. కొంతైనా పాప ప్రక్షాళన : కేసీఆర్ పై విజయశాంతి ఫైర్..

Published : May 27, 2021, 01:56 PM IST
అలా చేస్తేనే.. కొంతైనా పాప ప్రక్షాళన : కేసీఆర్ పై విజయశాంతి ఫైర్..

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ లో అణువణువునా నిండిన అహంకారం ఫలితం ఏమిటో నేటి మీడియా కథనం చూస్తే అర్థం అవుతుందన్నారు.

విపక్షాలు ఎంతగా చెప్పినా... ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా వినకుండా పట్టుదలకు పోయి ఈ సర్కారు నిర్వహించిన పలు ఎన్నికల వల్ల, పలువురు ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది కరోనా బారిన పడి.. ప్రాణాలు కోల్పోయారన్నారు.

వైద్య ఖర్చులు భరించలేక.. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారి పిల్లలు అనాధలయ్యారని తెలిపారు. అధికారం తప్ప మరేదీ పట్టని తెలంగాణ పాలకుల తీరు ఈ ఘోరానికి మూలమని ఆధారాలతో సహా మీడియా కథనం రుజువు చేసింది అన్నారు.

ఈటలను ఎందుకు పార్టీలో కొనసాగిస్తున్నారు: కేసీఆర్‌కి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్న...

తెలంగాణ సర్కార్ అసమర్ధ పాలన వల్ల.. పరిస్థితులు సవ్యంగా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, ప్రజావ్యతిరేక తప్పదని అధికార పార్టీకి బాగా తెలుసు అని ట్వీట్ చేశారు. అందుకే కరోనా ముప్పు ఉన్న సమయంలో అయితే తనకు నచ్చినట్టుగా ఎన్నికలు నిర్వహించుకుని, అధికారం చేజిక్కించుకోవాలని దురుద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు స్పష్టమవుతోందని విమర్శించారు.

ఈ తప్పుడు నిర్ణయాల ఫలితాలకు తెలంగాణ సర్కారే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు పరిహారం చెల్లించి, కొంతైనా పాపప్రక్షాళన చేసుకోవాలంటూ విజయశాంతితో హితవు పలికారు.
 
PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్