ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల పాటు లీజు ఇచ్చే విషయమై విపక్షాలు చేస్తున్న విమర్శలపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ స్పందించారు.
హైదరాబాద్: ఓఆర్ఆర్ బిడ్డింగ్ అంతర్జాతీయ స్థాయిలో జరిగిందని. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ విషయమై విపక్షాలు చేస్తున్న విమర్శలను అరవింద్ కుమార్ తోసిపుచ్చారు. అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయని ఆయన చెప్పారు. ఓఆర్ఆర్ బిడ్ ను ఎవరైనా బిడ్ ను చెక్ చేసుకోవచ్చన్నారు. నేషనల్ హైవే ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారమే ఓఆర్ఆర్ టెండర్లు పిలిచినట్టుగా ఆయన వివరించారు.
also read:ఓఆర్ఆర్ లీజ్‌లో ఆ 17 రోజుల్లో తెర వెనుక ఏం జరిగింది?: రఘునందన్ రావు
టోల్ ఫీ రూల్స్ 2008 ప్రకారమే వసూళ్లు చేస్తామన్నారు.ఓఆర్ఆర్ బిడ్డింగ్ కోసం ప్రభుత్వం మూడుసార్లు టెండర్ల గడువు పెంచిందని అరవింద్ కుమార్ గుర్తు చేశారు. మ్యూచివల్ ఫండ్స్ తరహలో టీఓటీ ఉంటుందన్నారు. . టీఓటీ విధానం చాలా రాష్ట్రాలు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. 2012 లో తెచ్చిన పాలసీ అమలు అవుతుందన్నారు.కేబినెట్ ఆమోదం తర్వాత టెండర్లకు వెళ్లినట్టుగా అరవింద్ కుమార్ వివరించారు..