జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా పడిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కార్పోరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ సమావేశాన్ని మేయర్ వాయిదా వేయడంతో బీజేపీ, కాంగ్రెస్ కార్పోరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బుధవారంనాడు బైఠాయించి నిరసనకు దిగారు.
జీహెచ్ఎంసీ సమావేశంలో సమస్యలు చర్చించకుండానే మేయర్ వాయిదా వేశారని బీజేపీ కార్పోరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారని కార్పోరేటర్లు గుర్తు చేశారు. ఆ తర్వాత మేయర్ ప్రసంగించారని బీజేపీ కార్పోరేటర్లు గుర్తు చేశారు. అయితే అదే సమయంలో సమావేశాన్ని లంచ్ బ్రేక్ కోసం వాయిదా వేస్తున్నామని మేయర్ ప్రకటించారని బీజేపీ కార్పోరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది సరైంది కాదన్నారు. సమావేశాన్ని ఆలస్యంగా ప్రారంభించి లంచ్ బ్రేక్ కోసం వాయిదా వేస్తామని మేయర్ ప్రకటించడాన్ని తాము తప్పు బట్టామని బీజేపీ కార్పోరేటర్లు చెబుతున్నారు. వాటర్ బోర్డు అధికారులను అసభ్య పద జాలంతో దూషించలేదని బీజేపీ కార్పోరేటర్లు తేల్చి చెప్పారు.
ఇవాళ సమావేశం వాయిదా వేయాలని ప్లాన్ తో మేయర్ వ్యవహరించారన్నారు. ఇవాళ 12 గంటలకు జరగాల్సిన సమావేశానికి మేయర్ 12:30 గంటలకు హాజరైనట్టుగా బీజేపీ కార్పోరేటర్లు చెప్పారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమైతేనే సమయం సరిపోదని వారు చెప్పారు.
మరో వైపు జీహెచ్ఎంసీ సమావేశం నిర్వహించాలనే ఉద్దేశ్యం మేయర్ కు లేదని కాంగ్రెస్ కార్పోరేటర్ విజయారెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలపై చర్చించాలనే ఉద్దేశ్యం బీఆర్ఎస్ కు లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
also read:జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం: సమావేశం బైకాట్ చేసిన అధికారులు
జీహెచ్ఎంసీ సమావేశం వాయిదా పడిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కార్పోరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ సమావేశాన్ని జరగకుండా అడ్డుకోవాలని బీజేపీ యత్నించిందని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆరోపించారు.