Matrimonial fraud : పెళ్లి, అమెరికా పేర్లతో యువతులకు వల.. డబ్బులు తీసుకుని టోకరా... ఘరానా మోసగాడి లీలలు..

By SumaBala BukkaFirst Published Mar 5, 2022, 7:18 AM IST
Highlights

పెళ్లి పేరుతో మోసాలు చాలా కామన్ గా మారిపోతున్నాయి. మహిళలను నమ్మించి వారి దగ్గరున్న సొమ్మును దోచుకుని ముఖం చాటేస్తున్నాడో ఘరానా మోసగాడు. మాట్రిమోనియల్ లో నమోదు చేసుకున్న మహిళలే లక్ష్యంగా ఈ నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

పెద్దపల్లి : ఆన్లైన్లో వివాహ రిజిస్ట్రేషన్ వల్ల లాభాలు ఎన్ని ఉన్నా.. అంతకు మించి మోసాలకు చాలా ఆస్కారం ఉంటోంది. ఎంతోమంది యువతులు మోసగాళ్ల బారిన పడే అవకాశం ఈజీగా దొరుకుతోంది. ఎంత సెక్యూర్డ్ గా ఉన్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఇలాంటి ఓ ఘరానా మోసం ఇటీవల మరోటి బయటడింది. 

Online Wedding Introduction Platformలో పేరు నమోదు  చేసుకున్న womenలే అతని లక్ష్యం. ముందు chating చేస్తాడు. తర్వాత మాటలతో మాయ చేస్తాడు. americaలో  నీకు job ఇప్పిస్తానంటూ ఆశ పెట్టి అందినకాడికి దోచుకుని ముఖం చాటేస్తాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో ఎందరినో మోసగించిన అతగాడి బండారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి ఏసిపి సారంగపాణి వెల్లడించిన వివరాల ప్రకారం…

సుల్తానాబాద్ కు చెందిన యువతి వివాహ సంబంధాల కోసం 2020లో ఓ మ్యాట్రిమోనీలో పేరు నమోదు చేసుకుంది. ఖమ్మంకు చెందిన వాసిరెడ్డి రాహుల్ ఆమెతో చాటింగ్ చేశాడు… పరిచయం పెరిగాక పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన తెచ్చాడు.. ఈ క్రమంలోనే తరచూ తన అవసరాలకు డబ్బులు తీసుకుని తిరిగి ఇచ్చేవాడు. కొన్నాళ్ల తర్వాత తనకు అమెరికాలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని, వీసా, ఇతర ఖర్చులకు రూ.7.5 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆ క్రమంలో యువతి తన వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరి అతను అడిగిన మొత్తాన్ని ఇచ్చింది. 

కొన్నాళ్ళ తర్వాత ఫోన్ ఎత్తకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన యువతి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  మూడు బృందాలతో హైదరాబాద్, ఖమ్మం, విజయవాడలలో  గాలించి ఎట్టకేలకు నిందితుడు రాహుల్ ను పట్టుకున్నామని ఏసీపీ తెలిపారు. నిందితుడు రాహుల్పై 2010లో ఖమ్మంలో,  2012లో  హైదరాబాద్ ఎల్బీనగర్ లో, 2013లో విజయవాడలో ఇదే తరహా కేసులు నమోదైనట్లు ఏసీపీ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో  కేటుగాడి బాధితులు అనేకమంది ఉన్నారన్నారు.

జల్సాల కోసం అడ్డదారులు..
‘ఖమ్మం జిల్లా మధిర మండలం వెంకటాపురంకి చెందిన వాసిరెడ్డి రాహుల్ ప్రవర్తనతో విసిగిపోయిన తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే ఇంట్లో నుంచి గెంటేశారు. అప్పటి నుంచి వాక్చాతుర్యంతో ఇతరులను మోసం చేయడంలో ఆరితేరాడు. తనకు ఆదాయ పన్ను శాఖ నుంచి ఇబ్బందులు ఉంటాయని కొందర్ని నమ్మించి,  వారి పేరుతో లక్షల విలువైన గృహోపకరణాలు, ఇతర ఖరీదైన వస్తువులను  కొనుగోలు చేసేవాడు. రెండు, మూడు వాయిదాలు కట్టి కనిపించకుండా పోయేవాడు. 

అలా విజయవాడకు చెందిన బండారు భాగ్యలక్ష్మికి రూ.1.80 లక్షలు, షేక్ కలీల్ కు రూ.4.86 లక్షలు,  ఓ నాయకుడు వెంకటేష్ కు రూ.1.20 లక్షలు, హైదరాబాద్కు చెందిన ప్రసన్నలక్ష్మికి రూ.25 లక్షలు, ప్రకాశం జిల్లా వాసి కరీముల్లాకు రూ.1.45 లక్షలు, అదే జిల్లావాసి అప్పన్నకు రూ.2.5 లక్షలు,  మణికంఠకు రూ.2 లక్షల వరకు కుచ్చుటోపీ పెట్టాడు. ఆ వస్తువులను మార్కెట్లో తక్కువ ధరకు అమ్మేసి ఆ డబ్బుతో గోవా, హైదరాబాదులో జల్సాలు చేసేవాడని ఏసిపి వివరించారు. 

click me!