కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ ఇంట్లో భారీ చోరీ.. రూ.46 లక్షల విలువైన నెక్లెస్ మాయం...

Published : May 31, 2022, 11:34 AM ISTUpdated : May 31, 2022, 11:35 AM IST
కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ ఇంట్లో భారీ చోరీ.. రూ.46 లక్షల విలువైన నెక్లెస్ మాయం...

సారాంశం

హైదరాబాద్ లోని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ ఇంట్లో చోరీ జరిగింది. 46 లక్షల రూపాయల విలువైన నెక్లెస్ మాయమయ్యింది. దీంతో కేవీపీ భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత KVP Ramachandra Rao ఇంట్లో భారీ Theft జరిగింది. దాదాపు రూ. 46 లక్షల విలువ గల 49 గ్రాముల Diamond necklace మాయమయ్యింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డైమండ్ నెక్లెస్ మాయం మీద కేవీపీ భార్య సునీత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న సునీత తెలుపు రంగు డైమండ్ నెక్లెస్ ధరించి ఓ ఫంక్షన్ కు వెళ్లారు. ఫంక్షన్ నుండి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత బెడ్ రూమ్ లో పెట్టగా.. కొద్దిసేపటికే నెక్లెస్ మాయం కావడంతో సునీత ఇళ్లంతా వెతికారు. డైమండ్ నెక్లెస్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పని మనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ రెండు రోజుల క్రితం కేవీపీ భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా, నిరుడు జూన్ లో మహారాష్ట్రలో ఓ పనిమనిషి రికార్డుల్లోకెక్కింది. అంటే పనిబాగా చేసి కాదు.. చేతివాటం చూపించి... పనిచేస్తున్న ఇళ్లలోనే వరుసగా చోరీలు చేసి ఇప్పటికి 50 సార్లు అరెస్ట్ అయ్యింది. ఆశ్చర్యంగా, కాస్త భయంగా అనిపిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెడితే... ముంబైలో ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తున్న వనిత గైక్వాడ్ (38) చేతివాటం చూపించి వరుస దొంగతనాలకు పాల్పడింది. తాజాగా వనిత గైక్వాడ్ తాను పనిచేస్తున్న ఇంట్లోనే 2,500 డాలర్లు దొంగిలించిందనే ఫిర్యాదుతో ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

కరుడుగట్టిన దొంగగా పేరొందిన వనిత పలుసార్లు తాను పనిచేసిన ఇళ్లలోనే చోరీలకు పాల్పడింది. దీంతో పోలీసులు పలు చోరీ కేసుల్లో వనిత గైక్వాడ్ ను 50 సార్లు అరెస్ట్ చేశారు. ప్రతిసారి పేర్లు మారుస్తూ.. ఇళ్లలో పనిచేస్తానని పనికి కుదిరి.. ఆ తరువాత చోరీలకు పాల్పడుతుందని పోలీసులు తెలిపారు. 

విలేపార్లే నివాసి అయిన ఫ్యాషన్ డిజైనర్ దీపిక గంగూలీ ఇంట్లో దొంగతనం కేసును జుహూ పోలీసులు విచారించగా చోరీ బాగోతం బయటపడింది. విఖ్రోలీలో వనితాను పోలీసులు అరెస్టు చేశారు. ఈమెకు ఇద్దరు పిల్లలున్నారని, వారు వేర్వేరుగా నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలో వనిత చోరీ బాగోతం బయటపడింది. వనిత చోరీ చేసిన ఇళ్లను గుర్తించేందుకు వాచ్ మెన్లను సంప్రదిస్తున్నామని పోలీసులు తెలిపారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?