విహారయాత్రలో విషాదం.. లక్నవరం చెరువులో మునిగి యువతీ, యువకుడు మృతి..

Published : May 31, 2022, 11:03 AM IST
విహారయాత్రలో విషాదం.. లక్నవరం చెరువులో మునిగి  యువతీ, యువకుడు మృతి..

సారాంశం

హైదరాబాద్‌లోని ICFAI బిజినెస్ స్కూల్‌కి చెందిన విద్యార్థుల విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ములుగు జిల్లా  లక్నవరం చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. వారి మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు.

హైదరాబాద్‌లోని ICFAIకి చెందిన విద్యార్థుల విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ములుగు జిల్లా  లక్నవరం చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. వారి మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు. మృతిచెందిన ఇద్దరిని సాయి ప్రీతమ్‌, తరుణిగా గుర్తించారు. వీరు మరో నలుగురు విద్యార్థులతో కలిసి లక్నవరం వెళ్లారు. అయితే స్నానానికి నీళ్లలోకి దిగిన సాయి ప్రీతమ్, తరుణిలు.. ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయారు. 

వివరాలు.. ICFAIలో చదవువుతున్న విద్యార్థులు సాయి ప్రీతమ్, తరుణి, హర్ష, వర్షిత, అమృత, కీర్తన లక్నవరం విహార యాత్రకు వచ్చారు. ఆన్‌లైన్‌లో కాటేజ్ బుక్ చేసుకున్న వీరు.. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు అక్కడికి చేరుకున్నారు. సరదాగా సెల్పీలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు. అయితే సరదాగా నీటిలో అడుతున్న సమయంలో నీటిలోని గుంతలో పడి సాయి ప్రీతమ్ మునిగిపోయాడు. ఆ తర్వాత అతడిని కాపాడే ప్రయత్నంలో తరుణి గల్లంతైంది. స్నేహితుల కళ్లముందే ప్రతీమ్, తరుణి నీటిలో మునిగిపోయారు. దీంతో ఆందోళన చెందిన మిగిలిన నలుగురు చుట్టుపక్కల వారిని విషయం తెలియజేశారు. 

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత కొద్ది సేపటికి సాయి ప్రీతమ్, తరుణిల మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయి ప్రీతమ్, తరుణి తమ కళ్లముందే నీళ్లలో పడి మృతిచెందడంతో.. మిగిలిన నలుగురు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?