ప్రణయ్ హత్య కేసు: జైలులో 10 కిలోల బరువు తగ్గిన మారుతీరావు

By telugu teamFirst Published Apr 29, 2019, 11:20 AM IST
Highlights

ప్రణయ్ హత్య కేసులోని ఆరుగురు నిందితుల్లో మరో ముగ్గురు వరంగల్‌ సెంట్రల్‌ జైలులోనే ఉన్నారు. ఉదయం 8 గంటలకు జైలు నుంచి విడుదలైన మారుతీరావు చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో గుర్తు పట్టరాకుండా మారిపోయారు.

మిర్యాలగుడా: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు వరంగల్ కేంద్ర కారాగారంలో పది కిలోల బరువు తగ్గారు. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో నిందితులు మారుతీరావు, శ్రవణ్ కుమార్, అబ్దుల్ కరీం ఆదివారం ఉదయం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. 

ప్రణయ్ హత్య కేసులోని ఆరుగురు నిందితుల్లో మరో ముగ్గురు వరంగల్‌ సెంట్రల్‌ జైలులోనే ఉన్నారు. ఉదయం 8 గంటలకు జైలు నుంచి విడుదలైన మారుతీరావు చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో గుర్తు పట్టరాకుండా మారిపోయారు. 7 నెలలు జైల్లో ఉండటంతో 10 కేజీల బరువు తగ్గాడు. 

దళిత సంఘాలు అడ్డుకుంటాయనే భయంతో జైలు ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన నిందితులు రెండు కార్లలో మిర్యాలగూడ వెళ్లిపోయారు. మారుతీరావు విడుదల నేపథ్యంలో తమకు ప్రాణ భయం ఉందని ప్రణయ్‌ భార్య అమృత, తండ్రి బాలస్వామి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

దాంతో నిందితుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ప్రణయ్‌ ఇంటి వద్ద భద్రతను పెంచారు. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత నిరుడు అదే పట్టణానికి చెందిన ప్రణయ్‌ అనే దళిత యువకుడిని పెళ్లి చేసుకుంది. దాన్ని తట్టుకోలేక మారుతీరావు గత ఏడాది సెప్టెంబరు 14న ప్రణయ్‌ని దా రుణంగా హత్య చేయించాడు. 
మారుతీరావు బెయిల్‌ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

ప్రణయ్ హత్య కేసు: జైలు నుంచి మారుతీరావు విడుదల

నిలిచిపోయిన ప్రణయ్ హత్యకేసు నిందితుల విడుదల

ప్రాణహాని ఉంది, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: బెయిల్ మంజూరుపై అమృత

మారుతీరావుకు బెయిల్... అమృత స్పందన ఇదే...

ప్రణయ్ హత్య కేసు: అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్

click me!