మే 25‌ నుండి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

By narsimha lodeFirst Published Apr 29, 2019, 11:12 AM IST
Highlights

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్స్‌లో  మార్పులు చేర్పులు చేసింది ఇంటర్ బోర్డు.  ఇంటర్ ఫలితాల్లో లోపాలు, రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కారణంగా  అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ను మార్చింది.

హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్స్‌లో  మార్పులు చేర్పులు చేసింది ఇంటర్ బోర్డు.  ఇంటర్ ఫలితాల్లో లోపాలు, రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కారణంగా  అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ను మార్చింది.

ఈ ఏడాది మే 25వ తేదీ నుండి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకొంది. తొలుత ఈ పరీక్షలను ఈ ఏడాది మే 16వ తేదీ నుండి నిర్వహించాలని భావించారు. కానీ,పరీక్ష ఫలితాల్లో చోటు చేసుకొన్న గందరగోళ ఫలితాల నేపథ్యంలో మే 25వ తేదీ నుండి పరీక్షలు నిర్వహించనున్నారు.

 

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి  సాయంత్రం ఐదున్నర గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకొంది.  ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 10వ తేదీన వెల్లడికానున్నాయి. ఎంసెట్ ర్యాంకుల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అదే విధంగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కూడ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.

click me!