మిర్యాలగూడ స్మశాన వాటికలో ఉద్రిక్తత: అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు

By narsimha lodeFirst Published Mar 9, 2020, 12:16 PM IST
Highlights

 ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కడసారి చూసేందుకు పోలీస్ బందోబస్తు మధ్య  అమృత స్మశాన వాటిక వద్దకు చేరింది. స్మశాన వాటిక వద్ద  అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

మిర్యాలగూడ: ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కడసారి చూసేందుకు పోలీస్ బందోబస్తు మధ్య  అమృత స్మశాన వాటిక వద్దకు చేరింది. స్మశాన వాటిక వద్ద  అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.  అమృత  మారుతీరావు డెడ్ బాడీని చూడకుండానే  ఆమె వెనుదిరిగింది. 

Also read:మారుతీ రావు అంత్యక్రియలు: శ్మశానవాటికకు బయలుదేరిన అమృత

 తండ్రి మృతదేహన్ని చూసేందుకు  పోలీసు రక్షణతో అమృత మిర్యాలగూడ స్మశానవాటికకు చేరుకొంది. సోమవారం నాడు స్మశానవాటికకు చేరుకొంది. పోలీస్ వాహనం  దిగిన  తర్వాత స్మశాన వాటికలోకి వెళ్లింది. ఆ సమయంలో  మారుతీరావు  డెడ్‌బాడీ చూసేందుకు  స్మశాన వాటిక లోపలికి వెళ్లింది. ఆ సమయంలో మారుతీరావు డెడ్‌బాడీ   చుట్టూ  బంధువులు, కుటుంబసభ్యులు ఉన్నారు.

మారుతీరావు  మృతదేహం  చూసేందుకు ప్రయత్నించేందుకు  అమృత ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదే సమయంలో మారుతీరావు సోదరుడు శ్రవణ్‌కుమార్  అమృత వైపు చూశారు. అమృత చుట్టూ మహిళా పోలీసులతో పాటు  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అమృత చుట్టూ రోప్ పార్టీ ఏర్పాటు చేసి పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారు.

మిర్యాలగూడలోని స్మవానవాటికకు చేరుకొన్న  వెంటనే స్థానికులు నినాదాలు చేయడంతో  పోలీసులు  ముందు జాగ్రత్తగా ఆమెను అక్కడి నుండి ఇంటికి సురక్షితంగా తీసుకొచ్చారు. 

తండ్రి మృతదేహం చూడకుండానే

తండ్రిని చూడకుండానే అమృత వెనుదిరిగింది.  పోలీసులు ఆమె చుట్టూ రక్షణగా నిలిచారు. అమృత గో బ్యాక్ అంటూ స్మశాన వాటిక వద్ద నినాదాలు చేశారు. మారుతీరావు మృతదేహం వద్ద శ్రవణ్ కుమార్,  మారుతీరావు భార్య గిరిజలు అంత్యక్రియల ఏర్పాట్లలో నిమిగ్నమై ఉన్నారు. 

ఈ సమయంలో నినాదాల హోరు విన్పించడంతో  అటువైపు వీళ్లిద్దరూ తిరిగి చూశారు. కానీ అప్పటికే పోలీసులు ఆమె రక్షణగా నిలిచారు.   దీంతో శ్రవణ్ కు కానీ, గిరిజకు కానీ అమృత కన్పించలేదు.

అమృత కూడ తన తండ్రి మృతదేహాన్ని కూడ చివరి చూపు చూడలేకపోయింది. పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉందని భావించిన పోలీసులు వెంటనే ఆమెను స్మశాన వాటిక నుండి రక్షక్ వాహనంలో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.

click me!