భార్య‌ను కిడ్నాప్ చేశారని భర్త ఫిర్యాదు.. పోలీసులు ఏమంటున్నారు (వీడియో)

Published : Sep 26, 2018, 10:27 AM ISTUpdated : Sep 26, 2018, 10:41 AM IST
భార్య‌ను కిడ్నాప్ చేశారని భర్త ఫిర్యాదు.. పోలీసులు ఏమంటున్నారు (వీడియో)

సారాంశం

హైదరాబాద్‌లో మతాంతర వివాహం చేసుకున్న ఓ వివాహిత కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. బేగంబజార్‌కు చెందిన రాజు-నాజ్నీన్ అనే యువతి యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు

హైదరాబాద్‌లో మతాంతర వివాహం చేసుకున్న ఓ వివాహిత కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. బేగంబజార్‌కు చెందిన రాజు-నాజ్నీన్ అనే యువతి యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్యసమాజ్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

నాజ్నీన్ హిందూ మతాన్ని స్వీకరించి.. తన పేరును పూజగా మార్చుకుంది. అయితే ఈ నెల 17న అమ్మాయి కనిపించకుండా పోయింది. తన భార్యను ఆమె కుటుంబసభ్యులు కిడ్నాప్ చేశారని.. ప్రస్తుతం తన భార్య 4 నెలల గర్భవతని ఆమెకు అబార్షన్ చేయిస్తానని తండ్రి బెదిరిస్తున్నాడని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. పరువు కోసం తన భార్యను చంపుతారని... ఆమెను తనకు అప్పగించాలని రాజు మీడియా ద్వారా తెలిపాడు. 

"

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌