కళ్లు నెత్తికెక్కిమాట్లాడతున్నావ్..చరిత్ర తెలుసుకో:కేటీఆర్ కు దామోదర వార్నింగ్

First Published 25, Sep 2018, 8:22 PM IST
Highlights

 మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహా నిప్పులు చెరిగారు. కేటీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాట్లాడేటప్పుడు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.  

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహా నిప్పులు చెరిగారు. కేటీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాట్లాడేటప్పుడు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.  

మేనిఫెస్టో కమిటీకి వివిధ వర్గాల నుంచి వినతులు వస్తున్నాయని వాటిలో ఎక్కువగా విద్య, వైద్య రంగంపై విజ్ఞప్తులు వస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించి ఓ క్యాలెండర్‌ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. 

అన్ని వర్గాలతో చర్చించి ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను రూపొందిస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెడతామని, ఆర్థిక స్థితి గతులను దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందిస్తున్నట్లు దామోదర రాజనర్సింహ తెలిపారు. 

Last Updated 25, Sep 2018, 8:22 PM IST