Nizamabad News: వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో బంధువుల ఆందోళన.. గడ్డమీది తండాలో తీవ్ర ఉద్రిక్తత

Published : Apr 14, 2022, 01:46 PM IST
Nizamabad News: వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో బంధువుల ఆందోళన.. గడ్డమీది తండాలో తీవ్ర ఉద్రిక్తత

సారాంశం

నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం గడ్డమీది తండాలో ఓ వివాహిత పొలం వద్ద ఆత్మహత్య చేసుకుంది. దీంతో అత్తింటి వద్ద మృతురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది


నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం గడ్డమీది తండాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వివాహిత పొలం వద్ద ఆత్మహత్య చేసుకుంది. దీంతో అత్తింటి వద్ద మృతురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వివరాలు.. గుగులోత్ సక్కు(30) అనే వివాహిత పంట పొలాల వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సక్కు తల్లిదండ్రులు.. ఆమె అత్తింటి వద్ద ఆందోళనకు దిగారు. సక్కు చనిపోవడానికి అత్తింటి వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. 

ఆందోళకు దిగడంతో పాటుగా మృతురాలి అత్తింటిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే అత్తింట్లో సామాగ్రికి నిప్పుపెట్టారు. దీంతో వంట సామాగ్రితో పాటు బైక్‌, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. ఈ క్రమంలోనే గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్